మాజీ మంత్రి మాస్ స్టెప్పులు..చూడాల్సిందే సుమీ..!
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు సరదా స్టెప్పులతో అదరగొట్టారు. తన ద్వితీయ కుమారుడు రాజేశ్ వివాహా వేడుకలో సరదాగా యాంకర్‌తో కలిసి డ్యాన్స్ చేశారు. శుక్రవారం వివాహం జరగ్గా..అదే రోజు రాత్రి సంగీత్ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు సరదా స్టెప్పులతో అదరగొట్టారు. తన ద్వితీయ కుమారుడు రాజేశ్ వివాహా వేడుకలో సరదాగా యాంకర్‌తో కలిసి డ్యాన్స్ చేశారు. శుక్రవారం వివాహం జరగ్గా..అదే రోజు రాత్రి సంగీత్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బంధుమిత్రులంతా ఆడిపాడారు. ఇదే క్రమంలో డ్యాన్స్ చేయాల్సిందిగా అక్కడికి వచ్చినవారు కోరడంతో అయ్యన్న కూడా కాలు కదిపారు. ఎల్లు వచ్చి గోదారమ్మ సాంగ్‌కి యాప్ట్ అయ్యే స్టెప్పులతో అక్కడికి వచ్చినవారిని ఆనందపరిచారు. ఆ తర్వాత గున్నా, గున్నా మామిడి సాంగ్‌కి సైతం మాస్ స్టెప్పులతో దంచికొట్టారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
