విశాఖ పర్యటన రద్దు.. రోడ్డు మార్గాన అమరావతికి చంద్రబాబు..!

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ పర్యటన రద్దు అయింది. ఆయన ఏపీకి వచ్చేందుకు.. డీజీపీ అనుమతివ్వడంతో ఇవాళ ఉదయం పదిగంటలకు రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ నుంచి

విశాఖ పర్యటన రద్దు.. రోడ్డు మార్గాన అమరావతికి చంద్రబాబు..!

Edited By:

Updated on: May 25, 2020 | 12:23 PM

Chandrababu naidu : ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ పర్యటన రద్దు అయింది. ఆయన ఏపీకి వచ్చేందుకు.. డీజీపీ అనుమతివ్వడంతో ఇవాళ ఉదయం పదిగంటలకు రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ నుంచి అమరావతికి చేరుకునే అవకాశం ఉంది. మరోవైపు.. ఎల్జీపాలిమర్స్ బాధితులను పరామర్శించేందుకు అనుమతి తీసుకున్నప్పటికీ.. విమాన సర్వీసులు ప్రారంభం కాకపోవడంతో విశాఖ పర్యటన రద్దైంది. ఈ నెల 27,28 తేదీల్లో టీడీపీ మహానాడు కార్యక్రమాలు జరుగనున్నాయి.

కాగా.. ఏపీ ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఈరోజు నుండి కాకుండా రేపటి నుంచి విమానాలను నడిపేందుకు కేంద్ర పౌరవిమానయానశాఖ అనుమతిచ్చింది. విమానాల ద్వారా వచ్చే వారిని క్వారెంటైన్ కు తరలించే విషయంపై ఇంకా మార్గదర్శకాలు రెడీ కాకపోవడంతోనే ఈరోజు విమానాలు వద్దని ప్రభుత్వం కోరినట్టు చెబుతున్నారు. అయితే చంద్రబాబు విశాఖ పర్యటనకు ఏర్పాట్లు చేసుకున్న తరుణంలో ఈ ఒక్క రోజు ఎయిర్ పోర్టులను మూసేయడం మీద టీడీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.