సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖ

ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. రాష్ట్రంలో కరోనా మహమ్మారి నియంత్రణ, విశాఖ మెడ్ టెక్ జోన్ లో భారీ ఎత్తున వెంటిలేటర్లు, వైద్యుల రక్షణ ఉపకరణాల తయారీ, పంట ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవడం, నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాసారు. వైరస్ వ్యాప్తి తీవ్రరూపం దాల్చకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని, దీనికోసం వైద్య పరీక్షలు పెంచాలని, పాజిటివ్‌ కేసులను గుర్తించి, సమస్య జటిలం […]

సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖ

Edited By:

Updated on: Apr 03, 2020 | 5:03 PM

ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. రాష్ట్రంలో కరోనా మహమ్మారి నియంత్రణ, విశాఖ మెడ్ టెక్ జోన్ లో భారీ ఎత్తున వెంటిలేటర్లు, వైద్యుల రక్షణ ఉపకరణాల తయారీ, పంట ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవడం, నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాసారు. వైరస్ వ్యాప్తి తీవ్రరూపం దాల్చకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని, దీనికోసం వైద్య పరీక్షలు పెంచాలని, పాజిటివ్‌ కేసులను గుర్తించి, సమస్య జటిలం కాకుండా చూడాలని ఆయన సలహా ఇచ్చారు.

కాగా.. ఏపీలో కోవిద్ 19 తన ప్రతాపాన్ని చూపిస్తోంది. కాబట్టి వైరస్ సోకిన వారిని ప్రజల నుంచి వేరు చేసి ప్రత్యేకంగా చికిత్సలు చేయించాలని చంద్రబాబు తన లేఖలో సూచించారు. ప్రజల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని, పేదలకు పౌష్టికాహారం కోసం అన్న క్యాంటీన్లను వినియోగించాలని కోరారు. కేంద్రం ప్రకటించిన రూ. 1.75 లక్షల కోట్ల ప్యాకేజీని వినియోగించుకుని, మూడు నెలలకు సరిపడా రేషన్‌, పింఛన్‌ ఒకేసారి పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.