అనంతలో టీడీపీ ఆందోళన, పోలీసుల లాఠీఛార్జ్‌

|

Aug 16, 2019 | 2:38 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్ల కోసం ఆందోళనలు, నిరసనలు మిన్నంటుతున్నాయి. రాష్ట్రంలో తమ ప్రభుత్వం ప్రారంభించిన అన్న క్యాంటీన్లను తెరవాలని తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. ఇందులో భాగంగా అనంతపురం జిల్లాలోని రాయదుర్గంలో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. టీడీపీ నేత, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు నేతృత్వంలో ఆందోళనకారులు పెద్ద ఎత్తున తమ నిరనసన తెలిపారు. పేదలకు రూ. 5లకే భోజనం అందిస్తున్న అన్న క్యాంటీన్లను వెంటనే తెరవాలని […]

అనంతలో టీడీపీ ఆందోళన, పోలీసుల లాఠీఛార్జ్‌
Follow us on
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్ల కోసం ఆందోళనలు, నిరసనలు మిన్నంటుతున్నాయి. రాష్ట్రంలో తమ ప్రభుత్వం ప్రారంభించిన అన్న క్యాంటీన్లను తెరవాలని తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. ఇందులో భాగంగా అనంతపురం జిల్లాలోని రాయదుర్గంలో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. టీడీపీ నేత, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు నేతృత్వంలో ఆందోళనకారులు పెద్ద ఎత్తున తమ నిరనసన తెలిపారు. పేదలకు రూ. 5లకే భోజనం అందిస్తున్న అన్న క్యాంటీన్లను వెంటనే తెరవాలని డిమాండ్‌ చేశారు. వైసీపీ ప్రభుత్వం ఇలాంటి ప్రతీకార చర్యలకు దిగడం మంచిది కాదని హితవు పలికారు. పెద్ద సంఖ్యలో రోడ్లపైకి చేరిన నిరసనకారుల ప్రదర్శనతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కాల్వ శ్రీనివాసులుతో పాటు టీడీపీ కార్యకర్తలను అరెస్ట్‌ చేశారు. వీరి అరెస్టులను నిరసిస్తూ..ఆందోళనకారులు పోలీసు వాహనాలను అడ్డుకున్నారు. పోలీసులు, టీడీపీ శ్రేణులకు మధ్య కాసేపు వాగ్వాదం నెలకొంది. చివరకు వారిపై లాఠీచార్జ్‌ చేసిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు.