AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ముందే తాండూరు టీఆర్‌ఎస్‌ ఫైటింగ్‌.. రసాభాసాగా మారిన సభ్యత్వ నమోదు కార్యక్రమం

వికారాబాద్‌ జిల్లా తాండూరులో టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం రసాభాసగా మారింది. వేదికపై ప్రసంగం విషయంలో నేతల మధ్య వాగ్వాదం

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ముందే తాండూరు టీఆర్‌ఎస్‌ ఫైటింగ్‌.. రసాభాసాగా మారిన సభ్యత్వ నమోదు కార్యక్రమం
K Sammaiah
|

Updated on: Feb 13, 2021 | 3:39 PM

Share

వికారాబాద్‌ జిల్లా తాండూరులో టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం రసాభాసగా మారింది. వేదికపై ప్రసంగం విషయంలో నేతల మధ్య వాగ్వాదం జరిగింది. మాటా మాటా పెరిగి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ముందే ఘర్షణకు దిగారు. తాండూరులోని ఓ ఫంక్షన్ హాల్‌లో యాలాల మండల కమిటీ ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డితో పాటు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సిద్రా శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ బాలేశ్వర్ గుప్త, ఏఎంసీ ఛైర్మన్ విఠల్ నాయక్, వైస్ ఛైర్మన్ వెంకట్‌రెడ్డి హాజరయ్యారు.

అయితే ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా సమావేశం ప్రారంభ ఉపన్యాసం చేశారు. ఏఎంసీ ఛైర్మన్ విఠల్ నాయక్‌కు మైక్ అందిస్తుండగా.. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సిద్రా శ్రీనివాస్ రెడ్డి అడ్డుకున్నారు. ఎమ్మెల్యే రోహిత్ కలగజేసుకొని సిద్రా శ్రీనివాస్ రెడ్డికి మైక్ ఇవ్వాలని చెప్పారు. రెండు నిమిషాల్లో ప్రసంగం ముగిస్తానని అప్పటి వరకు ఆగాలని విఠల్ చెప్పారు. అయితే ఇది యాలాల మండల పార్టీ సమావేశమని…నువ్వు తాండూరు మండలానికి చెందిన నీకు ఇక్కడేం పని అని ఎదురు తిరిగారు. ఇరువురి మధ్య మాటా మాటా పెరగడంతో సమావేశం రసాభాసాగా మారింది.

ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్సీ నచ్చజెప్పడంతో సిద్రా శ్రీనివాస్ ప్రసంగాన్ని ప్రారంభించారు. తన ప్రసంగంలో పార్టీలోకి కొందరు కొత్త బిచ్చగాళ్లు వచ్చారని అనడంతో ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా అడ్డుకున్నారు. రెండు రోజులుగా సమావేశాలుల జరుగుతున్నా… మండల అధ్యక్షుడిగా పట్టించుకోలేదని విమర్శించారు. ఇప్పుడొచ్చి గొడవ చేయడం ఏంటని నిలదీశారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, మహేందర్ రెడ్డి నచ్చజెప్పుతూ సమావేశాన్ని ముగించారు. మొత్తానికి తాండూరు అధికార పార్టీ నేతల్లో చెలరేగిన వివాదం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Read more:

తెలంగాణ జిల్లాలో కొనసాగుతున్న కాంగ్రెస్‌ పొలంబాట.. తాము అధికారంలోకి వస్తే ఆ పథకాలు యథాతథంగా అమలు చేస్తామన్న భట్టి

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్