AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తమిళనాడులో 26 వేలకు చేరువలో కరోనా కేసులు

తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 1,286 మందికి క‌రోనా పాజిటివ్. రాష్ట్రంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 25,872.

తమిళనాడులో 26 వేలకు చేరువలో కరోనా కేసులు
Balaraju Goud
|

Updated on: Jun 03, 2020 | 8:09 PM

Share

తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కొద్దిరోజులుగా రోజుకి వెయ్యి కేసులకు తగ్గకుండా నమోదవుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 1,286 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో రాష్ట్రంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 25,872కు చేరింది. బుధ‌వారం సాయంత్రం వ‌ర‌కు రాష్ట్రంలో క‌రోనా ప‌రిస్థితిపై త‌మిళ‌నాడు రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్ విడుద‌ల చేసింది. ఇవాళ మొత్తం 1286 క‌రోనా కేసులు న‌మోదు కాగా.. అందులో 1244 మంది స్థానికులు కాగా.. 42 మంది విదేశాల నుంచి, ఇత‌ర రాష్ట్రాల నుంచి వ‌చ్చిన వార‌ని తెలిపింది. కరోనా నుంచి కోలుకుని బుధవారం 610 మంది డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకు మొత్తం 14,316 మంది కోలుకున్నారు. బుధవారం చనిపోయిన 11 మందితో కలిపి మొత్తంగా 208 మందిని కరోనా మ‌హ‌మ్మారి బ‌లితీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 11,345 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తమిళనాడు ఆరోగ్య శాఖ తెలిపింది. త‌మిళ‌నాడులో న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల్లో ఒక్క చెన్నై సిటీలోనే భారీగా 17,598 కేసులు న‌మోద‌య్యాయి. అలాగే రాష్ట్రంలో ఎక్కువ‌గా మ‌గ‌వాళ్లే క‌రోనా బారిన‌ప‌డ్డార‌ని ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్ప‌టి వ‌ర‌కు 16,181 మ‌గ‌వాళ్లు క‌రోనా బారిన‌ప‌డ‌గా.. 9,677 మ‌హిళ‌ల‌కు, 14 మంది ట్రాన్స్ జెండ‌ర్ల‌కు వైర‌స్ సోకింద‌ని వెల్ల‌డించింది.

Follow Us
మీరు సూపర్ సార్.. ఆ ఎనర్జీ ఏంటండి బాబూ..
మీరు సూపర్ సార్.. ఆ ఎనర్జీ ఏంటండి బాబూ..
జేబులో పదేపదే చేయి పెడుతూ దిగిన ప్రయాణికుడు.. చెక్ చేస్తే..
జేబులో పదేపదే చేయి పెడుతూ దిగిన ప్రయాణికుడు.. చెక్ చేస్తే..
మెట్రో ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్.. ఆ కష్టాలు తీరాలంటే..
మెట్రో ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్.. ఆ కష్టాలు తీరాలంటే..
ఈరోజే ఆకాశంలో అద్భుతం.. స్ట్రాబెర్రీ మూన్ దర్శనం! ఎందుకు ప్రత్యేక
ఈరోజే ఆకాశంలో అద్భుతం.. స్ట్రాబెర్రీ మూన్ దర్శనం! ఎందుకు ప్రత్యేక
ఇండస్ట్రీలోనే తోపు నటుడు.. అంత్యక్రియలకు ఒక్క హీరో వెళ్లలేదు..
ఇండస్ట్రీలోనే తోపు నటుడు.. అంత్యక్రియలకు ఒక్క హీరో వెళ్లలేదు..
త్వరలో భారీగా తగ్గనున్న బంగారం ధరలు..కొనడానికి బెస్ట్ సమయం ఇదే!
త్వరలో భారీగా తగ్గనున్న బంగారం ధరలు..కొనడానికి బెస్ట్ సమయం ఇదే!
ఆధార్ నుండి పాస్‌పోర్ట్ వరకు.. జూలై 1 నుంచి జరిగే కీలక మార్పులు ఇ
ఆధార్ నుండి పాస్‌పోర్ట్ వరకు.. జూలై 1 నుంచి జరిగే కీలక మార్పులు ఇ
ఏరువాక పౌర్ణమి 2026: రైతన్నల తొలి పండుగ ఇదే..! ప్రాముఖ్యత ఏంటంటే
ఏరువాక పౌర్ణమి 2026: రైతన్నల తొలి పండుగ ఇదే..! ప్రాముఖ్యత ఏంటంటే
తల్లి ‌కళ్లెదుటే విగతజీవిగా కొడుకు.. రెప్పపాటులో ఊహించని ప్రమాదం
తల్లి ‌కళ్లెదుటే విగతజీవిగా కొడుకు.. రెప్పపాటులో ఊహించని ప్రమాదం
శక్తివంతమైన కర్మ దశలోకి ప్రపంచం..? 2026 రెండో అర్ధభాగం ఎలా...
శక్తివంతమైన కర్మ దశలోకి ప్రపంచం..? 2026 రెండో అర్ధభాగం ఎలా...