9 – 11 తరగతుల విద్యార్థులు పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్, కీలక నిర్ణయాన్ని ప్రకటించిన ముఖ్యమంత్రి

కోవిడ్ -19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని 9, 10, 11 తరగతుల విద్యార్థులను ఎలాంటి పరీక్షలు లేకుండా తదుపరి తరగతికి ప్రమోట్ చేయాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె..

  • Venkata Narayana
  • Publish Date - 1:38 pm, Thu, 25 February 21
9 - 11 తరగతుల విద్యార్థులు పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్, కీలక నిర్ణయాన్ని ప్రకటించిన ముఖ్యమంత్రి

కోవిడ్ -19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని 9, 10, 11 తరగతుల విద్యార్థులను ఎలాంటి పరీక్షలు లేకుండా తదుపరి తరగతికి ప్రమోట్ చేయాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వామి ఈ రోజు ప్రకటించారు.అయితే, 12 వ తరగతికి మాత్రం రాష్ట్రం విద్యాశాఖ పరీక్షలు నిర్వహిస్తుంది. దీని కోసం టైమ్‌టేబుల్‌ను తమిళనాడు ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ విడుదల చేసింది. ఈ పరీక్షలు మే 3 నుంచి మే 21 మధ్య జరుగుతాయి.

ఇక, జనవరి 19 న తమిళనాడులో 10, 12 తరగతులకు క్లాసులు తిరిగి ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఎస్ఎస్ఎల్సీ (క్లాస్ 10), ప్లస్ టూ (క్లాస్ 12) బోర్డు పరీక్షలలో హాజరయ్యే విద్యార్థుల కోసం మాత్రమే విద్యార్థులకు హాస్టల్స్, ఇంకా నివాస సౌకర్యాలను తిరిగి ప్రారంభించడానికి తమిళనాడు ప్రభుత్వం అనుమతించింది. 2021. క్లాస్ 12 పరీక్షలు మే 3 న లాంగ్వేజ్ పేపర్‌తో ప్రారంభమై మే 21 న కెమిస్ట్రీ, అకౌంటెన్సీ, జియోగ్రఫీ పేపర్‌లతో ముగుస్తాయి. పరీక్ష వ్యవధి మూడు గంటలు ఉంటుంది. తమిళనాడు క్లాస్ 12 పరీక్షలు ఉదయం 10 నుండి మధ్యాహ్నం 01:15 వరకు జరుగుతాయి.

ఇదిలాఉండగా, క‌రోనా నేప‌థ్యంలో లాంగ్‌ గ్యాప్‌ తర్వాత తెలంగాణలో పెద్దబడి గంటలు మోగాయి. ప‌ది నెల‌ల త‌ర్వాత తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలు ఇప్పటికే తెరుచుకున్నాయి. కొవిడ్‌ రూల్స్‌ పాటిస్తూ… స్టూడెంట్స్‌, టీచర్లు స్కూల్స్‌కు వచ్చారు. స్కూల్‌ అసెంబ్లీ, సామూహిక ప్రార్థనలు రద్దు చేశారు. ఒక్కో తరగతి గదిలో కేవలం 20 మందినే కూర్చోబెట్టారు. స్కూళ్లో మాస్క్‌, భౌతికదూరం, శానిటైజ్‌ కంపల్సరీ చేశారు. ప్రాథమికోన్నత, ఉన్నత టీచర్లంతా స్కూల్స్‌కు వచ్చారు. 16 వారాల పాటు క్లాసులు జరగనున్నాయి. ఉదయం తొమ్మిదిన్నర నుంచి సాయంత్రం 4:45 గంటల వరకు క్లాసులు ఉంటాయి. అటు -హైదరాబాద్, సికింద్రాబాద్‌లో మాత్రం ఉదయం 8:45 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పాఠాలు చెబుతారు.

ఇక, తెలంగాణలో 6, 7, 8 తరగతుల ప్రత్యక్ష బోధనకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వీలుకాని పక్షంలో మార్చి 1వ తేదీవరకు విడతలవారీగా తరగతులు ప్రారంభించుకొనే వెసులుబాటు కల్పించింది. దీంతో 8,891 ప్రభుత్వ, 10,275 ప్రైవేట్‌ పాఠశాలలు, 1,157 గురుకులాల్లోని 17.10 లక్షల మంది విద్యార్థులు బడిబాట పడుతున్నారు. 9, 10 తరగతులకు అనుసరించిన కరోనా మార్గదర్శకాలే ఈ తరగతులకు వర్తిస్తాయని అధికారులు స్పష్టంచేశారు. మే 26వ తేదీవరకు పాఠశాలలు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ మార్గదర్శకాలు విడుదలచేసిన సంగతి తెలిసిందే.

Read also : సాక్షాత్తూ మహిళా ఐపీఎస్ అధికారిణిపై అత్యున్నత పదవిలో ఉన్న డీజీపీ లైంగిక వేధింపుల పర్వం, తమిళనాడులో ప్రకంపనలు