Brother kills Sister: చెల్లెల్లు తన మాట వినలేదని దారుణానికి ఒడిగట్టిన అన్న.. వ్యాట్సాప్ వీడియోలు చూస్తుందని నరికి చంపిన దుర్మార్గుడు!

తమిళనాడులో జరిగిన మరో దారుణం.. దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది. అతిగా వాట్సాప్‌ వాడుతోందని చెల్లినే నరికి చంపేశాడు ఓ అన్న.

Brother kills Sister: చెల్లెల్లు తన మాట వినలేదని దారుణానికి ఒడిగట్టిన అన్న.. వ్యాట్సాప్ వీడియోలు చూస్తుందని నరికి చంపిన దుర్మార్గుడు!
Thoothukudi Brother Killed His Sister
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 30, 2021 | 4:10 PM

Brother kills Sister in Tamil Nadu: తమిళనాడులో జరిగిన మరో దారుణం.. దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది. వాట్సాప్‌ వాడుతోందని చెల్లినే నరికి చంపేశాడు ఓ అన్న. తూత్తుకుడి జిల్లా వాసవం పురంనగర్‌లో జరిగిన దారుణ హత్య ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సోషల్‌ మీడియా వాట్సాప్‌ వినియోగిస్తోందని.. సొంత చెల్లెల్ని చంపేయడంపై అంతా విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. సుధలై అనే వ్యక్తి తూత్తుకుడి జిల్లాలోని వల్లనాడు సమీపంలోని వాసవంపురం వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాుడు. ఈ రైతుకు ఒక కుమారుడు మలైరాజా (20), కుమార్తె కవిత (17) ఉన్నారు. కవిత ప్లస్ టూ చదువుతోంది. లాక్‌డౌన్‌ కారణంగా అన్‌లైన్ చదువుల కోసం 12 తరగతి చదువుతున్న కవితకు సెల్ ఫోన్ కోనిచ్చాడు అన్న మలైరాజా. అయితే అన్న కొనిచ్చిన సెల్‌ఫోన్‌తో క్లాస్‌లు వినాల్సిన చెల్లెలు… వాట్సాప్‌లో వీడియోలు చూస్తూ చాటింగ్‌తో టైం వేస్ట్ చేస్తోందని తరచూ వార్నింగ్ ఇచ్చాడు. చాలా సార్లు హెచ్చరించినా కవిత తన అలవాటు మార్చుకోలేదు. కోపంతో రగిలిపోయిన మలైరాజా.. వాట్సాప్ చూస్తున్న టైంలోనే నరికి చంపేశాడు. వెనుక నుంచి కత్తితో విచక్షణ రహింత నరికి చంపేశాడు మలైరాజు. చెల్లిని చంపిన తర్వాత మలైరాజా అక్కడి నుంచి పారిపోయాడు. ఈ విషయం తెలియగానే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

వల్లానాడు సమీపంలోని అడవిలో పారిపోతున్న రాజాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో వాసవంపురం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. స్థానికుల్లో కలకలం రేగింది. ఇది లోకల్‌గా పెద్ద హాట్ న్యూస్‌ అయింది. టెక్నాలజీ అప్‌డేట్‌ అవుతోంది. ఇన్‌ఫర్మేషన్ షేరింగ్ ఇంపార్టెన్స్‌ కూడా పెరిగింది. భద్రత కోసం మహిళలను యాప్స్‌ వాడాలన్న సూచనలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ టైంలో వాట్సాప్ చూస్తోందని చెల్లిని చంపిన మలైరాజా చర్యలను ఖండిస్తున్నాయి మహిళా సంఘాలు.

Read Also…. Anti-Rabies Shot: వైద్య సిబ్బంది నిర్వాకం.. చదువురాని మహిళ కరోనా టీకా కోసం వెళితే.. కుక్క కాటు ఇంజక్షన్ ఇచ్చిన నర్సు