AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఘోర ప్రమాదం.. జిల్లా కలెక్టర్ కారు ఢీకొని రైతు మృతి

తమిళనాడు జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈరోడ్ జిల్లా కలెక్టర్ వాహనం ఢీకొని ఓ రైతు మృతి చెందాడు. రైతు బైక్‌పై వెళ్తుండగా కలెక్టర్ వాహనం అనుకోకుండా రైతు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మరణించాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఘోర ప్రమాదం.. జిల్లా కలెక్టర్ కారు ఢీకొని రైతు మృతి
Farmer Killed By Erode Collector's Vehicle
Anand T
|

Updated on: Oct 22, 2026 | 5:36 PM

Share

కలెక్టర్ వాహనం ఢీకొని రైతు మృతి చెందిన ఘటన తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో జరిగింది . వివరాల్లోకి వెళ్తే.. ఈరోడ్ జిల్లా మేజిస్ట్రేట్ అయిన కందస్వామి, గురువారం తన అధికారిక వాహనంలో గోపిచెట్టిపాలయం వైపు వెళ్తున్నాడు.. ఈ క్రమంలో వెల్లాంగ్ కోయిల్ ప్రాంతానికి చెందిన షణ్ముగం అనే రైతు కూడా స్కూటీపై అదే రూట్‌లో వచ్చాడు. అయితే ప్రమాదవశాత్తు కలెక్టర్ వాహనం రైతు స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రైతు షణ్ముగానికి తీవ్ర గాయాలు కాగా.. కలెక్టర్ వాహన డ్రైవర్ అతన్ని రక్షించే ప్రయత్నం చేశారు.

ఇంతలో సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే రైతును హాస్పిటల్‌కు తరలించారు. అయితే షణ్ముగాన్ని పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. దీంతో, షణ్ముగం మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై రైతు బంధువులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అయితే షణ్ముగం డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకుని ఇంటికి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. అంతకుముందు, కలెక్టర్ ప్రమాద స్థలం నుంచి మరో కారులో ఈరోడ్‌కు బయలుదేరారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగడంతో రైతు బంధువులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
స్ట్రీట్ ఫుడ్ ఫేమస్ పావ్ భాజీ! తింటే రుచికి ఫిదా అవ్వాల్సిందే
స్ట్రీట్ ఫుడ్ ఫేమస్ పావ్ భాజీ! తింటే రుచికి ఫిదా అవ్వాల్సిందే
ఘోర ప్రమాదం.. జిల్లా కలెక్టర్ కారు ఢీకొని రైతు మృతి
ఘోర ప్రమాదం.. జిల్లా కలెక్టర్ కారు ఢీకొని రైతు మృతి
టీ20ల్లో అత్యధిక ఛేజ్.. చరిత్ర సృష్టించిన టీమిండియా..!
టీ20ల్లో అత్యధిక ఛేజ్.. చరిత్ర సృష్టించిన టీమిండియా..!
53 ఏళ్ల వయసులో ఫిట్నెస్ సీక్రెట్.. ప్రభుదేవా రోజూ ఏం చేస్తారంటే..
53 ఏళ్ల వయసులో ఫిట్నెస్ సీక్రెట్.. ప్రభుదేవా రోజూ ఏం చేస్తారంటే..
భారీ గ్రహం రాకతో ఈ రాశుల వారిపై కనకవర్షం.. మీ రాశి ఉందా?
భారీ గ్రహం రాకతో ఈ రాశుల వారిపై కనకవర్షం.. మీ రాశి ఉందా?
షుగర్, బీపీ, బరువు కంట్రోల్ అవ్వాలన్నా పర్ఫెక్ట్ బ్రేక్‌ఫాస్ట్!
షుగర్, బీపీ, బరువు కంట్రోల్ అవ్వాలన్నా పర్ఫెక్ట్ బ్రేక్‌ఫాస్ట్!
ఇంట్లోనే చిన్న కుండీలో గుత్తులు గుత్తులుగా ఉసిరికాయలు..
ఇంట్లోనే చిన్న కుండీలో గుత్తులు గుత్తులుగా ఉసిరికాయలు..
పదో తరగతి 2027 పబ్లిక్‌ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల
పదో తరగతి 2027 పబ్లిక్‌ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల
లైంగిక ఆరోపణలతో DRDO ఉద్యోగిపై దాడి.. హాస్పిటల్‌కు తరలించేలోపే..
లైంగిక ఆరోపణలతో DRDO ఉద్యోగిపై దాడి.. హాస్పిటల్‌కు తరలించేలోపే..
మనిషి ఎత్తు నిటారుగా నిలబడగలదు.. కింగ్ కోబ్రా గురించి..
మనిషి ఎత్తు నిటారుగా నిలబడగలదు.. కింగ్ కోబ్రా గురించి..