తమిళనాడు సీఎం పళనిస్వామి కీలక ప్రకటన.. కాలేజీ విద్యార్థులకు ఉచితంగా 2జీబీ డేటా కార్డులు

|

Jan 11, 2021 | 1:57 AM

విద్యార్థులకు ఉచితంగా డేటా ఇస్తున్నట్లు ప్రకటించారు తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి.

తమిళనాడు సీఎం పళనిస్వామి కీలక ప్రకటన.. కాలేజీ విద్యార్థులకు ఉచితంగా 2జీబీ డేటా కార్డులు
Follow us on

2GB data for college students: తమిళనాట అసెంబ్లీ ఎన్నికల సమయం సమీపిస్తున్నవేళ రాజకీయ పార్టీలు హామీల వర్షం కురిపిస్తున్నారు. విద్యార్థులకు ఉచితంగా డేటా ఇస్తున్నట్లు ప్రకటించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి. కరోనా నేపథ్యంలో ఆన్‌లైన్‌ క్లాసులను సద్వినియోగం చేసుకునేందుకు విద్యార్థులకు రోజుకు 2 జీబీ డేటాను ఉచితంగా అందించాలని నిర్ణయించినట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. కాలేజీ విద్యార్థులందరికీ ఉచిత డేటా కార్డులు ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి పళనిస్వామి ఆదివారం ప్రకటించారు.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి దెబ్బకు విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో పాఠశాలలు, కాలేజీలు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తున్నాయి. విద్యార్థులంతా ఈ క్లాసులను సద్వినియోగం చేసుకునేందుకు జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు రోజుకు 2 జీబీ డేటా ఉచితంగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ కళాశాలలతో పాటు, ఎయిడెడ్‌ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు డేటా కార్డులు పంపిణీ చేయనున్నట్టు వివరించారు. తమిళనాడు ప్రభుత్వం నిర్ణయంతో ఆ రాష్ట్రంలో మొత్తంగా 9.69 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.