వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్… అలాంటి బిగ్ బాస్ కు బ్రేక్ వేసేవారు ఉన్నారా…?. ఇప్పటివరకు అయితే లేరు. కరోనా సమయంలో కూడా ఈ షో ఆగలేదు. అన్ని భాషల్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుని షో రన్ చేస్తున్నారు. అలాంటి బిగ్ బాస్ షోను కూడా ఆపినవాళ్లు ఉన్నారు. అవును బిగ్ బాస్ హౌస్‌కు తాలాలేసి.. హౌస్ మెట్స్ అందరినీ బయటకు తీసుకెళ్లిపోయారు. అది కూడా ఇంకా సగానికి పైగా షో మిగిలుండగానే. నిజమండీ బాబు. అయితే మేము చెప్పేది తమిళ బిగ్ బాస్ గురించి. నివర్ తుఫాన్ ఎఫెక్ట్ బిగ్ బాస్‌కు కూడా గట్టిగానే తగిలింది. భారీ వర్షాలతో చెంబరబాక్కాం డ్యామ్ ఫుల్ అయిపోయి.. నీళ్లు ఆ పక్కనే ఉన్న బిగ్ బాస్ సెట్‌లోకి వచ్చేశాయి. నేచర్ మ్యాటర్… ఎవరు మాత్రం ఏం చేయగలరు.. తట్ట బుట్టా సర్దేసి కంటెస్టెంట్స్‌ను బయటకు తీసుకొచ్చేశారు.
అంటే షో ఆపేసినట్టు మాత్రం కాదండోయ్.. ప్రస్తుతానికైతే ఈ కంటెస్టెంట్స్ అందరినీ ఆ పక్కనే ఓ ఫైవ్ స్టార్ హోటల్ పెట్టారు.. పరిస్థితులు కాస్త సెట్టవ్వగానే మళ్లీ సెట్ రెడీ చేసి హౌస్‌లోకి పంపేస్తారు. ఈ న్యూస్ మీడియా సర్కిల్స్ లో ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నా.. బిగ్ బాస్ టీం మాత్రం అఫీషియల్ అప్‌డేట్ ఇవ్వట్లేదని ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్.
Also Read :
Bigg Boss 4: బెస్ట్ కెప్టెన్‌గా హారిక.. వరెస్ట్ కెప్టెన్‌గా అరియానా.. ఫినాలే వరకు ‘నో’ కెప్టెన్