బిగ్ బాస్ 4కు హారికే చివరి కెప్టెన్… త్వరలో మరింత రసవత్తరంగా బిగ్ బాస్ పోరు… ట్విస్టులు ఇవ్వనున్న బిగ్ బాస్

బిగ్ బాస్ సీజన్‌ 4 విజయవంతంగా 11 వారాలు పూర్తి చేసుకోబోతోంది. మరో 23 రోజుల్లో సీజన్‌ ముగియనుంది. ఈ తరుణంలో మిగిలిన 3 వారాలలో గతంలో చూడని టాస్కులను, ట్విస్ట్‌లను ఇచ్చి షోని మరింత రసవత్తంగా మార్చనున్నారట బిగ్‌బాస్‌ నిర్వాహకులు.

  • Umakanth Rao
  • Publish Date - 9:37 pm, Fri, 27 November 20
బిగ్ బాస్ 4కు హారికే చివరి కెప్టెన్... త్వరలో మరింత రసవత్తరంగా బిగ్ బాస్ పోరు... ట్విస్టులు ఇవ్వనున్న బిగ్ బాస్

బిగ్ బాస్ సీజన్‌ 4 విజయవంతంగా 11 వారాలు పూర్తి చేసుకోబోతోంది. మరో 23 రోజుల్లో సీజన్‌ ముగియనుంది. ఈ తరుణంలో మిగిలిన 3 వారాలలో గతంలో చూడని టాస్కులను, ట్విస్ట్‌లను ఇచ్చి షోని మరింత రసవత్తంగా మార్చనున్నారట బిగ్‌బాస్‌ నిర్వాహకులు. అందులో భాగంగా ఇంటి సభ్యులకు మరో భారీ షాక్‌ ఇవ్వబోతున్నాడట బిగ్‌బాస్‌.

ఇకపై బిగ్‌బాస్‌ హౌస్‌లో కెప్టెన్‌ ఉండడట. ప్రస్తుతం ఉన్న హారికనే బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌కి చివరి కెప్టెన్ అని తెలుస్తోంది. అంటే వచ్చే మూడు వారాలు ఎవరికీ ఇమ్యూనిటీ లభించదు. అందరు కంటెస్టెంట్లూ ఎలిమినేషన్ జోన్‌లో ఉన్నట్లే లెక్క. ఒకవేళ నామినేట్ కాని వాళ్లో లేదా స్పెషల్‌ పవర్‌ గెలుచుకున్న వాళ్లు తప్పితే.. ప్రత్యేకంగా కెప్టెన్‌కి లభించే ఇమ్యూనిటితో తప్పించుకునే చాన్స్‌ లేదు.

కాగా, బిగ్‌ బాస్ రియాల్టీ షో కు మంచి ఆదరణ లభిస్తోంది. తెలుగులో గత మూడు సీజన్ల మాదిరే నాల్గో సీజన్‌కు కూడా మంచి స్పందన వస్తుంది. హౌజ్ లో ఉన్న ప్రతీ కంటెస్టెంటూ విజేతగా నిలిచేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ముఖ్యంగా అభిజిత్, సోహెల్, అఖిల్ టైటిల్ బరిలో ముందు వరుసలో ఉన్నారు. కాగా, మోనాల్, అరియానా, అవినాష్, హారిక సైతం టైటిల్ పోటీదారులకు గట్టిపోటినిస్తున్నారు.