కీచక టైలర్…ట్రయల్ రూమ్‌లో కెమెరా పెట్టి వందలమంది..

ప్రస్తుతం మహిళలకు భద్రత అనేది పెద్ద సమస్యగా మారింది. ఎక్కడ ఏ ఉన్మాది దాడి చేస్తాడో తెలీదు…ఏ కీచకుడు మీద పడతాడో ఊహకందదు..ఇలా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు అనేకం. ఈ మధ్య కాలంలో సీక్రెట్ కెమెరాలు కూడా వారి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయి. మహిళల డ్రెస్సింగ్ రూమ్స్, వాష్ రూమ్స్‌లో స్పై కెమెరాలు పెడుతోన్న ఉన్మాదులు..వాటిని ఇంటర్నెట్‌లో పెడతామంటూ వేధింపులు పాల్పడుతున్నారు. మరికొందరు సదరు ఫోటోలను, వీడియోలను పోర్న్ సైట్స్‌లో పెట్టి సైకిక్ ఆనందాన్ని పొందుతున్నారు. ముంబయిలోని […]

కీచక టైలర్...ట్రయల్ రూమ్‌లో కెమెరా పెట్టి వందలమంది..
Follow us

|

Updated on: Feb 12, 2020 | 8:59 AM

ప్రస్తుతం మహిళలకు భద్రత అనేది పెద్ద సమస్యగా మారింది. ఎక్కడ ఏ ఉన్మాది దాడి చేస్తాడో తెలీదు…ఏ కీచకుడు మీద పడతాడో ఊహకందదు..ఇలా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు అనేకం. ఈ మధ్య కాలంలో సీక్రెట్ కెమెరాలు కూడా వారి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయి. మహిళల డ్రెస్సింగ్ రూమ్స్, వాష్ రూమ్స్‌లో స్పై కెమెరాలు పెడుతోన్న ఉన్మాదులు..వాటిని ఇంటర్నెట్‌లో పెడతామంటూ వేధింపులు పాల్పడుతున్నారు. మరికొందరు సదరు ఫోటోలను, వీడియోలను పోర్న్ సైట్స్‌లో పెట్టి సైకిక్ ఆనందాన్ని పొందుతున్నారు.
ముంబయిలోని అంధేరిలో ఇప్పుడు అటువంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. టైలర్‌గా పనిచేసే ఓ వ్యక్తి తన షాపు..ట్రయల్ రూమ్‌లో ఓ చిన్న సీక్రెట్ కెమెరా పెట్టి మహిళలు దుస్తులు మార్చుకునే వీడియోలను చిత్రీకరించాడు. అలా కొన్ని వందలమంది వీడియోలను సేకరించాడు. ఇటీవలే కెమెరా ఉందని ఓ మహిళ అనుమానించడంతో..కీచకుడి బాగోతం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే..అంధేరి లోఖండ్‌వాలా ఏరియాలో నివశించే షహనాజ్ సజ్జాద్  మహిళల టైలరింగ్ షాపును రన్ చేస్తున్నాడు. బాగా కుడతాడని పేరుండటంతో అతని వద్దకు చాలామంది మహిళలు వచ్చేవారు. అక్కడే ఉన్న ట్రయిల్ రూమ్‌లో తమ దుస్తులు ఫిట్‌గా ఉన్నాయో, లేవో పరీక్షించుకునేవారు. అలానే ఈ నెల 9వ తేదీన షాపులోని ట్రయిల్ రూమ్‌కి వెళ్లిన మహిళకు గోడకు ప్లాస్టిక్ వస్తువు వేలాడుతూ కనిపించింది. అనుమానం వచ్చిన మహిళ..ఆ వస్తువును పరీక్షించగా వెనక భాగంలో సెల్‌ఫోన్ కనిపించింది. అది రికార్డ్ మోడ్‌లో ఉండటంతో భయాందోళనకు గురైన మహిళ..ఆ ఫోన్ పరిశీలించి చూడగా లోపల వందల సంఖ్యలో మహిళలు బట్టలు మార్చుకుంటున్న వీడియోలు దర్శనమిచ్చాయి. దీంతో వెంటనే సదరు మహిళ పోలీసులను సంప్రదించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.