మతిపోగొట్టిన మెగాస్టార్ ‘సైరా ‘ఆభరణాలు.. ఎక్కడో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘సైరా’ నరసింహారెడ్డి గురించి తెలిసిందే. తొలితరం స్వాతంత్ర సమరయోధుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధరాంగా తీస్తున్న ఈ చిత్రంపై టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోంది, అత్యంత భారీ బడ్జెట్‌తో ఎక్కడ తగ్గకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు హీరో రామ్ చరణ్. మూవీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు ముగించుకుని ఈ చిత్రం గాంధీ జయంతి అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రం ప్రధానంగా రాచరిక […]

మతిపోగొట్టిన మెగాస్టార్ 'సైరా 'ఆభరణాలు.. ఎక్కడో తెలుసా?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Sep 29, 2019 | 3:18 AM

మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘సైరా’ నరసింహారెడ్డి గురించి తెలిసిందే. తొలితరం స్వాతంత్ర సమరయోధుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధరాంగా తీస్తున్న ఈ చిత్రంపై టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోంది, అత్యంత భారీ బడ్జెట్‌తో ఎక్కడ తగ్గకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు హీరో రామ్ చరణ్. మూవీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు ముగించుకుని ఈ చిత్రం గాంధీ జయంతి అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రం ప్రధానంగా రాచరిక వ్యవస్థకు చెందినది కావడంతో అందులో ఆయా పాత్రలు ధరించిన వస్త్రాలు, ఆభరణాలకు కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ‘సైరా’ మూవీలో ప్రధాన పాత్రలు పోషించిన చిరంజీవి, బాలీవుడ్ బిగ్ బి అమితాబ్‌లు ధరించిన ఆభరణాలను శనివారం హైదరాబాద్ మంగత్రాయ్ జ్యూవెల్లర్స్‌లో ప్రదర్శించారు. ఈ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్‌గా మెగాస్టార్ కుమార్తె సుస్మిత ఎన్నో జాగ్రత్తలు తీసుకుని వివిధ ఆభరణాలను డిజైన్ చేయించారు. వీటిని ప్రదర్శనకు పెట్టడంతో వీటిని చూసేందుకు చూపరులు ఆసక్తి చూపారు. మంగత్రాయ్ వంటి జ్యూవెల్లర్స్‌తో కలిసి ‘సైరా’ మూవీకి పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందని, అదో గొప్ప అనుభూతి అంటూ తన మనసులో భావాన్ని తెలియజేశారు సుస్మిత.

syeraa ornaments displayed in hyderabad

అయితే గతంలో హృతిక్ రోషన్, ఐశ్వర్యారాయ్ కలిసి నటించిన చారిత్రాత్మక చిత్రం జోథా అక్బర్ మూవీలో ఐష్ ధరించిన ఆభరణాలకు కూడా ఎంతో పేరు వచ్చింది. అటువంటి మోడల్ నగలు కూడా బహుళ ప్రాచుర్యాన్ని పొందిన విషయం తెలిసిందే.