‘సైరా’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది… టాక్ ఏంటంటే?
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో దర్శకుడు సురేందర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ఈ చిత్రం భారీ అంచనాల నడుమ అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మొదటి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా సినిమా రూపొందటంతో అన్ని భాషల్లోనూ అంచనాలు ఏర్పడ్డాయి. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ రివ్యూను ఉమైర్ సంధూ ట్విట్టర్ లో ప్రకటించారు. సినిమా సూపర్ […]
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో దర్శకుడు సురేందర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ఈ చిత్రం భారీ అంచనాల నడుమ అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మొదటి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా సినిమా రూపొందటంతో అన్ని భాషల్లోనూ అంచనాలు ఏర్పడ్డాయి.
కాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ రివ్యూను ఉమైర్ సంధూ ట్విట్టర్ లో ప్రకటించారు. సినిమా సూపర్ గా ఉందని, మేకింగ్, మెగాస్టార్ నటన, స్క్రీన్ ప్లే అన్ని సినిమాకు ప్లస్ అయ్యాయని, బాక్సాఫీస్ దగ్గర రికార్డులు కొల్లగొట్టటం ఖాయం అని ట్వీట్ చేశారు. మెగాస్టార్ తో పాటు అమితాబ్, సుదీప్ లు నటనతో ఆకట్టుకున్నట్టు ఉమైర్ ట్విట్టర్ లో పేర్కొన్నాడు. డైరెక్టర్, స్క్రీన్ ప్లే, సౌండ్ ట్రాక్, అన్ని సినిమాకు ప్లస్ అయ్యాయని 4 రేటింగ్ ఇస్తున్నట్టు ఉమైర్ సంధూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. కాగా, ఇతడు గతంలో ‘సాహో’ సినిమాకి కూడా ఇలానే రివ్యూ ఇచ్చాడు. మరి చూడాలి ‘సైరా’ సినిమా ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంటుందో.?
#SyeRaNarasimhaReddy from Overseas Censor ! #Chiranjeevi is stupendous and clearly in top form. He holds you attentive right from the first frame till the penultimate moments. The supporting cast is top notch, especially #AmitabhBachchan [terrific], #Sudeep [wonderful]. ⭐⭐⭐⭐
— Umair Sandhu (@UmairFilms) September 29, 2019
First Review #SyeRaNarasimhaReddy ! A film like #SyeRaa makes you proud that an Indian filmmaker dared to dream big and accomplished it. It is definitely not to be missed. Call it a box-office blockbuster today, but tomorrow, it will be remembered as a classic. ⭐⭐⭐⭐ pic.twitter.com/cF6E92Ide1
— Umair Sandhu (@UmairFilms) September 29, 2019