ప్రముఖ ఫుడ్ డెలివరీ ఫ్లాట్‌ఫామ్ స్విగ్గీ వినియోగదారులను మరింతగా ఆకర్షిస్తోంది. స్విగ్గీకి రోజురోజుకి వినియోగదారుల సంఖ్య పెరుగుతోంది. ఆర్డర్ చేసిన నిమిషాల్లోనే కావాల్సిన ఫుడ్ డెలివరీ చేస్తుండటంతో వినియోగదారుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. అయితే ఇప్పుడు స్విగ్గీ మరో సరికొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. స్విగ్గీ కొత్తగా డిజిటల్ వ్యాలెట్‌ను రూపొందించింది.
కస్టమర్ల కోసం ఫుడ్ డెలివరీ స్విగ్గీ సొంతంగా డిజిటల్ వ్యాలెట్‌ను రూపొందించింది. ఐసీఐసీఐ బ్యాంక్‌తో కలిసి కొత్త ఫిచర్ ’స్విగ్గీ మనీ‘ని అందుబాటులోకి తెచ్చింది. ఒక్క క్లిక్‌తో కస్టమర్లు ఫుడ్ ఆర్డర్ చేసుకునేందుకు వీలుగా దీనిని రూపొందించామని కంపెనీ నిర్వాహకులు తెలిపారు. కాగా, ఈ ‘స్విగ్గీ మనీ’లో ముందుగా కస్టమర్లు కొంత డబ్బును స్టోర్ చేసుకోవాలని, ఆర్డర్ బుక్ చేసినప్పుడు అందులో నుంచి మనీ కట్ అవుతుందని చెప్పారు.