సుశాంత్ కేసులో ఇద్దరు ముంబై పోలీసులకు సీబీఐ సమన్లు

| Edited By: Pardhasaradhi Peri

Aug 25, 2020 | 7:28 PM

సుశాంత్ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ బృందం ఇద్దరు ముంబై పోలీసు అధికారులకు సమన్లు జారీ చేసింది. తాము బస చేసిన గెస్ట్ హౌస్ కి రావాలని సూచించింది. అయితే ఈ ఇద్దరు అధికారుల్లో..

సుశాంత్ కేసులో ఇద్దరు ముంబై పోలీసులకు సీబీఐ సమన్లు
Follow us on

సుశాంత్ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ బృందం ఇద్దరు ముంబై పోలీసు అధికారులకు సమన్లు జారీ చేసింది. తాము బస చేసిన గెస్ట్ హౌస్ కి రావాలని సూచించింది. అయితే ఈ ఇద్దరు అధికారుల్లో ఒకరు ఆసుపత్రిలో ‘చికిత్స’ పొందుతుండగా, మరొకరు కరోనా వైరస్ క్వారంటైన్ లో ఉన్నారట.. ఈ కేసుకు సంబంధించి కొన్ని డాక్యుమెంట్లను తేవాలని వీరిని సీబీఐ కోరినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు ముంబై పోలీసులకు ఈ దర్యాప్తు బృందం నుంచి ఎలాంటి సమన్లు అందకపోయినా.. ఇలా జరగడం ఇదే మొదటిసారి. వీటికి ఈ అధికారులిద్దరూ  వేర్వేరు కారణాలు చూపుతూ సీబీఐ కి ‘దూరం’గా ఉండడం విడ్డూరం.

ఇలా ఉండగా.. సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిని, ఆమె తండ్రిని సీబీఐ త్వరలో ప్రశ్నించవచ్ఛునని తెలుస్తోంది. సుశాంత్ ఇంటి హౌస్ కీపర్ నీరజ్ సింగ్ ని, సుశాంత్ మాజీ మేనేజరు, నటుడు అయిన సిద్దార్థ్ పితానిని అధికారులు సుదీర్ఘంగా విచారించారు.