AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్టింగ్ ఆపరేషన్‌లో విస్తుపోయే నిజాలు.. సుశాంత్ ట్రైనర్ సంచలన ఆరోపణలు!

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సుశాంత్ ఫిట్‌నెస్‌ ట్రైనర్ సమీ అహ్మద్ తాజాగా ఓ స్టింగ్ ఆపరేషన్‌లో విస్తుపోయే నిజాలను బయటపెట్టాడు.

స్టింగ్ ఆపరేషన్‌లో విస్తుపోయే నిజాలు.. సుశాంత్ ట్రైనర్ సంచలన ఆరోపణలు!
Ravi Kiran
|

Updated on: Jul 31, 2020 | 4:50 PM

Share

Sushant Fitness Trainer Sami Ahmed: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఆయన మరణానికి కారణం రియా చక్రవర్తి అనేలా కీలకమైన విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్న తరుణంలో సుశాంత్ ఫిట్‌నెస్‌ ట్రైనర్ సమీ అహ్మద్ తాజాగా ఓ స్టింగ్ ఆపరేషన్‌లో విస్తుపోయే నిజాలను బయటపెట్టాడు. ఓ జాతీయ న్యూస్ ఛానల్ నిర్వహించిన ఈ స్టింగ్ ఆపరేషన్‌లో రియా సుశాంత్‌కు ఇప్పించిన ట్రీట్‌మెంట్‌ గురించి కీలక విషయాలు వెల్లడించాడు.

”గత ఐదేళ్ళుగా సుశాంత్, నేను కలిసి పని చేస్తున్నాం. ఆయన ఎంతో మంచివారు. మానసిక ఆరోగ్యంపైనే ఎక్కువ శ్రద్ధ చూపించేవారు. సుశాంత్ నాకు, మా అమ్మకు చాలా క్లోజ్. మే 29న నా తల్లి మరణించినప్పుడు.. ఆ విషయం తెలుసుకుని జూన్ 1న సుశాంత్ ఫోన్ చేసి ఎలాంటి అవసరం వచ్చినా తనకు చెప్పమని ధైర్యాన్ని ఇచ్చారు. ఇక నాతో మాట్లాడిన రెండు వారాల్లోనే ఆయన చనిపోయారన్న వార్త వినడం చాలా బాధ కలిగించింది. ఆ షాక్ నుంచి బయటికి రావడానికి చాలా సమయం పట్టింది” అని సమీ చెప్పుకొచ్చాడు.

”రియా సుశాంత్ లైఫ్‌లోకి వచ్చిన తర్వాత అంతా మారిపోయింది. ఆయన ప్రవర్తనలో కూడా మార్పు వచ్చింది. సుశాంత్ మందులు ఏవి తీసుకోవాలన్నా రియానే ఇచ్చేదిడాక్టర్స్ సలహా పాటించకుండానే సుశాంత్‌కు రియా మందులు ఇచ్చి ఉండొచ్చు. సుశాంత్ మానసిక పరిస్థితి తెలియకుండానే రియా తీసుకొచ్చిన డాక్టర్ ఆయనకి చికిత్స చేశారు. మెడిసిన్స్ కూడా ఇచ్చారని సమీ అహ్మద్ వివరించాడు.

Also Read:

సుశాంత్ ఆత్మతో కబుర్లు.. మరిన్ని అనుమానాలు.. వైరలవుతున్న మరో వీడియో..

 సుశాంత్ మరణం వెనుక రహస్యాలు.. షాకింగ్ నిజాలు.. వైరల్ వీడియో..