Suseenthiran Clarifies About Niddhi Aggarwal: ఈస్మార్ట్ శంకర్‌తో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ ఇమేజ్ సంపాదించుకుంది నటి నిధి అగర్వాల్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించడంతో నిధికి ఆఫర్లు క్యూ కట్టాయి. ఈ క్రమంలోనే తమిళంలో శింబు సరసన ‘ఈశ్వరన్’ అనే చిత్రంలో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుందీ బ్యూటీ.
సుశీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆడియో వేడుక ఇటీవల జరిగింది. ఈ క్రమంలో నిధిఅగర్వాల్‌తో పాటు దర్శకుడు సుశీంద్రన్ వేదికపైకి వచ్చాడు. ఈ సమయంలో నిధిని దర్శకుడు ఆటపట్టించాడు. ఈ సందర్భంగా హీరో శింబును ఉద్దేశించి.. ‘శింబు మామా ఐ లవ్ యూ’ అని చెప్పమని నిధి అగర్వాల్‌ను సుశీంద్రన్ ఒత్తిడి చేశాడు. దీనికి నిధి తిరస్కరించింది. అయితే అనంతరం ఈ అంశంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. హీరోయిన్‌ను అలా ఇబ్బంది పెడతారా అంటూ సుశీంద్రన్ నెగిటివ్ కామెంట్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో ఈ అంశంపై దర్శకుడు మరోసారి స్పందించాల్సి వచ్చింది. ఈ అంశానికి ఫుల్‌స్టాప్ పెట్టే ఉద్దేశంలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఈ చిత్రంలో ‘మామా.. మామా ఐ లవ్యూ’ అంటూ హీరో శింబు వెంటపడే పాత్రలో నిధి అగర్వాల్ నటించిందని, అందుకే తాను ఆడియో లాంచ్ వేదికపై ఆ డైలాగ్ చెప్పాలని హీరోయిన్ నిధి అగర్వాల్‌ను కోరానని, అంతేకానీ ఇందులో ఎలాంటి ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ఇక ఈ సినిమా ఈ నెల13న విడుదలకానుంది.
Also Read: Nabha Natesh : ఈ ఇస్మార్ట్ బ్యూటీకి సౌత్ ఇండియన్ మాస్ సినిమాలంటే చాలా ఇష్టమట..!