Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సూర్యకు సరైన సమయం వస్తుంది.. మనం వేచి చూడాలి అంతేః రోహిత్ శర్మ

గత కొన్ని సీజన్ల నుంచి ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరపున సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా రాణిస్తున్నాడు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా జట్టు విజయాల్లో..

సూర్యకు సరైన సమయం వస్తుంది.. మనం వేచి చూడాలి అంతేః రోహిత్ శర్మ
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 22, 2020 | 10:14 AM

Surya Kumar Yadav: గత కొన్ని సీజన్ల నుంచి ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరపున సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా రాణిస్తున్నాడు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇక ఈ ఏడాది ఐపీఎల్‌లో కూడా సూర్యకుమార్ యాదవ్ ప్రదర్శన అద్భుతం అని చెప్పాలి. దీనితో అతడ్ని ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేస్తారని అందరూ భావించారు. కానీ అది మాత్రం జరగలేదు. బీసీసీఐ సెలెక్టర్లు తీసుకున్న ఈ నిర్ణయానికి పలువురు మాజీలు విమర్శలు గుప్పించారు. ఇక తాజాగా సూర్య కుమార్ యాదవ్‌పై హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ స్పందించాడు.

సూర్యకుమార్ యాదవ్‌కు సరైన సమయం వస్తుందని.. త్వరలోనే భారత్ జట్టుకు ఎంపిక అవుతాడని రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. ‘జట్టుకు ఎంపిక కాని రోజు సూర్య తీవ్ర నిరాశ చెందాడు. ఆ సమయంలో తనతో నేను ఏం మాట్లాడలేదు. ఆ తర్వాత కొద్దిసేపటికి అతడే నా దగ్గరకు వచ్చి.. నువ్వేమి బాధపడకు.. నేను ఆ బాధ నుంచి బయటపడి ముంబై గెలుపు కోసం ఆడతా అని చెప్పాడు. ఒక్క ఐపీఎల్ మాత్రమే కాదు కెరీర్ పరంగా కూడా సూర్య సరైన మార్గంలోనే వెళ్ళుతున్నాడని అప్పుడే నాకు అర్ధమైంది’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.

Also Read:

మాస్క్ లేకుంటే రూ. 2 వేలు భారీ జరిమానా.. నోటిఫికేషన్ జారీ చేసిన సర్కార్…

రోజుకు గరిష్టంగా 12 గంటలు.. వారానికి 48 గంటలు.. కార్మిక శాఖ కొత్త ప్రతిపాదన..

ఆరేళ్లుగా వీడని మిస్టరీ కేసు.. నిందితులను పట్టిస్తే రూ. 5 లక్షల డాలర్ల రివార్డు.!

వచ్చే ఐపీఎల్‌కు చెన్నై జట్టు భారీ మార్పులు.. ఆ ఐదుగురిపై వేటు తప్పదు.. లిస్టులో ధోని.!