Allu Arjun Fans : కటౌట్ చూసి కొన్నికొన్ని నమ్మెయ్యాలి డూడ్ అనే డైలాగ్ డార్లింగ్‌దే కదా..! కానీ.. ఇప్పుడా పంచ్ అల్లు వారబ్బాయి కూడా ఇమిటేట్ చేస్తున్నారు. అక్కడితో ఆగలేదు.. నాక్కొంచెం తిక్కుంది.. దానికో లెక్కుంది అని కూడా అంటున్నారు. లేటెస్ట్‌గా బన్నీ ఇస్తున్న స్టేట్‌మెంట్స్ ఇటువంటి సౌండే ఇస్తున్నాయి. మిగతా హీరోలతో పోలిస్తే.. కెరీర్ విషయంలో పక్కా ప్లానింగ్‌తో వున్నా స్టైలిష్ స్టార్. గత పదిహేడేళ్లలో ఇరవై సినిమాలు మాత్రమే చేసిన బన్నీ.. పుష్ప మూవీ తర్వాత.. కథ వేరే వుంటది అంటున్నారు. సో.. ఇకమీదట బన్నీ మార్క్ దూకుడు చూడబోతున్నామన్నమాట. ‘ఆహా’ ఇంటర్వ్యూలో బన్నీ ఇచ్చిన స్టేట్‌మెంట్స్.. పరిశ్రమలో హాట్ టాపిక్స్ అయ్యాయి.
‘అల వైకుంఠపురము’లో మూవీ ఆల్‌టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిందని.. ఇక మీదట అంతకుమించి అద్భుతాలు చూడబోతున్నారని చెప్పారు బన్నీ. ఇట్స్ జస్ట్ బిగినింగ్.. అంటున్నప్పుడు తనలోని కాన్ఫిడెన్స్ లెవల్స్ కనిపించాయి. పైగా.. పుష్ప మూవీతో పాన్ ఇండియా మార్కెట్‌ని టేస్ట్ చెయ్యబోతున్నారు. ‘జులాయి’ సినిమా ముందు తనకైన భుజం గాయాన్ని ప్రస్తావిస్తూ.. ఆ గ్యాప్ తర్వాత తనకు పని పట్ల కమిట్‌మెంట్ పెరిగిందన్నారు. బతికున్నంత వరకు సినిమాలు చేస్తానన్నారు.
అన్నపూర్ణ స్టూడియోకి వెళ్లినప్పుడు.. మరొకరి స్టూడియోలో నేనెందుకు సినిమాలు చెయ్యాలి అనే ఫీల్ కలిగిందని.. అక్కడికక్కడే సొంత స్టూడియోకు ప్లాన్ చేశానని చెప్పారు బన్నీ. సో.. అల్లు స్డూడియోస్ నిర్మాణం వెనుక బన్నీదే మేజర్ ఇంటెన్షన్. సొంత ఎంపైర్ క్రియేట్ చేసుకున్న తర్వాత బన్నీ జర్నీ ఎలా ఉంటుందో అన్న ఆతృత సినీ ప్రేమికుల్లో పెరిగిపోయింది.
Also Read :
LIC Jeevan Shanti: ఎల్‌ఐసీలో అదిరే పాలసీ.. ఒక్కసారి డబ్బులు కడితే ప్రతి నెలా వేలల్లో పింఛన్ !