అయోధ్య కేసు.. ఆగష్టు వరకూ సస్పెన్స్..

అయోధ్య భూ వివాదంపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఇబ్రహీం కైఫుల్లా నేతృత్వంలో ఏర్పాటైన ముగ్గురు సభ్యుల కమిటీ మరింత అదనపు సమయం కావాలని ఈ సందర్భంగా కోర్టును కోరింది. పూర్థి స్థాయి నివేదికకు ఆగష్టు 15 వరకు సమయం కావాలని.. అప్పటి వరకు మధ్యవర్తిత్వ తంతును పూర్తి చేస్తామని కమిటీ తెలిపింది. మధ్య వర్తుల కమిటీ సేకరించిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్.. పలు […]

అయోధ్య కేసు.. ఆగష్టు వరకూ సస్పెన్స్..

Edited By:

Updated on: May 10, 2019 | 12:42 PM

అయోధ్య భూ వివాదంపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఇబ్రహీం కైఫుల్లా నేతృత్వంలో ఏర్పాటైన ముగ్గురు సభ్యుల కమిటీ మరింత అదనపు సమయం కావాలని ఈ సందర్భంగా కోర్టును కోరింది. పూర్థి స్థాయి నివేదికకు ఆగష్టు 15 వరకు సమయం కావాలని.. అప్పటి వరకు మధ్యవర్తిత్వ తంతును పూర్తి చేస్తామని కమిటీ తెలిపింది. మధ్య వర్తుల కమిటీ సేకరించిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్.. పలు అంశాలను బయటికి వెల్లడించడం సరికాదన్నారు. కోర్టు ఇచ్చిన గడువును ముస్లిం లాబోర్డు కూడా సమర్థించింది.