విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనపై సుప్రీంలో విచారణ

|

Oct 29, 2020 | 1:19 PM

విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఎల్జీ పాలిమర్స్ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ యూయూ లలిత్ ధర్మాసనం విచారించింది.

విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనపై సుప్రీంలో విచారణ
Follow us on

విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఎల్జీ పాలిమర్స్ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ యూయూ లలిత్ ధర్మాసనం విచారించింది. ఎల్జీ పాలిమర్స్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఎన్జీటీ సుమోటోగా కేసు తీసుకోవడంపై ఎల్జీ పాలిమర్స్ అభ్యంతరం వ్యక్తంచేసింది. ఎన్జీటీలో కేసు విచారణ నవంబర్ 3న ఉందని ముకుల్ రోహత్గి కోర్టుకు తెలిపారు. ఎన్జీటీలో కమిటీ నివేదికపై పది రోజుల్లో అభ్యంతరాలను సమర్పించాలని ఎల్జీ పాలిమర్స్‌ను సుప్రీం ఆదేశించింది. సుప్రీంకోర్టు తదుపరి ఆదేశాల వరకు ఎన్జీటీలో కేసు విచారణ వాయిదా వేయాలని ధర్మాసనం సూచించింది. తదుపరి విచారణ నవంబర్ 16కు వాయిదా వేసింది.

విశాఖపట్నం గ్యాస్ లీకేజీ ఘటన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆర్ఆర్ వెంకటాపురం ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీ నుంచి స్టైరిన్ విష వాయువు లీక్ అయిన ఘటనలో 14 మంది చనిపోగా, అనేక మంది ఆసుపత్రి పాలయ్యారు. విశాఖ గ్యాస్ లీక్ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోటి రూపాయల చొప్పున నష్ట పరిహారాన్ని అందించారు.

Also Read :

హెలికాఫ్టర్‌లో పెళ్లికి వెళ్లిన ఎన్ఆర్ఐ ఫ్యామిలీ… కేసు నమోదు

ప్రియుడిని పరిచయం చేసిన పూనమ్ బజ్వా

తుంగభద్ర పుష్కరాలు : స్నానానికి అనుమతి లేదు !