AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేసీఆర్ ప్రజల మనిషి.. దుబ్బాక అభివృద్ధి నాదే బాధ్య‌తః హరీష్ రావు

తెలంగాణ‌లో నైజాం పాలన నుంచి గత పాలకుల వరకు భూమి శిస్తు వ‌సూలు చేశారు. కానీ, కేసీఆర్ మాత్రం భూమి ఉన్న ప్ర‌తి అన్నదాతకు రైతుబంధు ప‌థ‌కం ద్వారా డ‌బ్బులిచ్చి చ‌రిత్ర తిర‌గ‌రాశార‌ని రాష్ట్ర ఆర్థిక మంత్రి హ‌రీష్ రావు వెల్లడించారు.

కేసీఆర్ ప్రజల మనిషి.. దుబ్బాక అభివృద్ధి నాదే బాధ్య‌తః హరీష్ రావు
Balaraju Goud
|

Updated on: Oct 29, 2020 | 1:26 PM

Share

తెలంగాణ‌లో నైజాం పాలన నుంచి గత పాలకుల వరకు భూమి శిస్తు వ‌సూలు చేశారు. కానీ, కేసీఆర్ మాత్రం భూమి ఉన్న ప్ర‌తి అన్నదాతకు రైతుబంధు ప‌థ‌కం ద్వారా డ‌బ్బులిచ్చి చ‌రిత్ర తిర‌గ‌రాశార‌ని రాష్ట్ర ఆర్థిక మంత్రి హ‌రీష్ రావు వెల్లడించారు. దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక నేప‌థ్యంలో తొగుట మండ‌లం ఘ‌న‌పూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో మంత్రి హ‌రీష్ రావు పాల్గొన్నారు. రైతుల‌కు నాణ్య‌మైన ఉచిత విద్యుత్ ఇచ్చిన ఏకైక‌ ప్ర‌భుత్వం టీఆర్ఎస్ ప్ర‌భుత్వం మాత్ర‌మే అని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ప్రజల మనిషి అని, ప్రజా సంక్షేమానికే కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారని గుర్తు చేశారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ సదుపాయం లేదన్న హరీష్.. రైతులకు వ్యతిరేకంగా వ్యవసాయ బిల్లులు తీసుకువచ్చిందన్నారు. విదేశీ మ‌క్క‌లు తెచ్చి తెలంగాణ రైతుల నోట్లో మ‌ట్టి కొట్టాల‌ని బీజేపీ నాయ‌కులు చూస్తున్నారని హరీష్ ఆరోపించారు.

గ‌తంలో ఓట్ల కోసం నేతలు వస్తే గ్రామాల్లో మ‌హిళ‌లు ఖాళీ నీటి బిందెల‌తో అడ్డుకునేవారన్న హరీష్.. ఇప్పుడు ఆ ప‌రిస్థితి ఎక్క‌డా లేదన్నారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇంటింటికీ మంచినీరు అందిస్తున్నార‌ని తెలిపారు. బీజేపీ నాయ‌కుల‌కు ఓట్ల ద్వారానే బుద్ది చెప్పాల‌ని ప్ర‌జ‌ల‌ను కోరారు. దుబ్బాక అభివృద్ధి త‌న బాధ్య‌తే అని హ‌రీష్ రావు మరోసారి స్ప‌ష్టం చేశారు.

Follow Us
వైయస్ షర్మిల ఇంట్లో పెళ్లి సందడి..డాక్టర్‌తో కూతురు నిశ్చితార్థం!
వైయస్ షర్మిల ఇంట్లో పెళ్లి సందడి..డాక్టర్‌తో కూతురు నిశ్చితార్థం!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. తిరుపతికి మరో వందే భారత్..!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. తిరుపతికి మరో వందే భారత్..!
నీటిని నమ్ముకునే కంటే సూర్యుడిని నమ్మడం బెస్ట్ అంటున్న రైతులు
నీటిని నమ్ముకునే కంటే సూర్యుడిని నమ్మడం బెస్ట్ అంటున్న రైతులు
ఫ్రూట్ ఆఫ్ ఏంజెల్ గురించి మీకు తెలుసా..?
ఫ్రూట్ ఆఫ్ ఏంజెల్ గురించి మీకు తెలుసా..?
గణేష్ చతుర్థి.. తప్పక దర్శించాల్సిన 5 ప్రసిద్ధ గణపతి పండళ్లు..
గణేష్ చతుర్థి.. తప్పక దర్శించాల్సిన 5 ప్రసిద్ధ గణపతి పండళ్లు..
ఆ సీఐ నోటి దురుసు! వృద్ద మహిళ పట్ల అసభ్యకర పదాల ప్రయోగం..
ఆ సీఐ నోటి దురుసు! వృద్ద మహిళ పట్ల అసభ్యకర పదాల ప్రయోగం..
కన్నీళ్లు పెట్టిస్తున్న 74 ఏళ్ల వృద్ధుడి లేఖ..!
కన్నీళ్లు పెట్టిస్తున్న 74 ఏళ్ల వృద్ధుడి లేఖ..!
తనకంటే 18 ఏళ్ల చిన్నవాడితో రొమాన్స్.. థియేటర్లను షేక్ చేసిన మూవీ.
తనకంటే 18 ఏళ్ల చిన్నవాడితో రొమాన్స్.. థియేటర్లను షేక్ చేసిన మూవీ.
తెలివైన భర్తకు పిసినారి పెళ్ళాం... సంసారంలో శాంతికి అదే ముఖ్యం!
తెలివైన భర్తకు పిసినారి పెళ్ళాం... సంసారంలో శాంతికి అదే ముఖ్యం!
ఛోటా ప్యాకెట్‌తో సిరాజ్‌ మాటల యుద్ధం.. మధ్యలో తెలుగోడి ఎంట్రీ
ఛోటా ప్యాకెట్‌తో సిరాజ్‌ మాటల యుద్ధం.. మధ్యలో తెలుగోడి ఎంట్రీ