సూపర్ స్టార్ మహేష్ బాబు స్టైలిష్ లుక్.. ఫిదా అవుతున్న నెటిజన్లు

|

Dec 05, 2020 | 6:22 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఉన్న ఫాలోయింగ్ గురించి  ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా అమ్మాయిల్లో మహేష్ క్రేజ్ మాములుగా ఉండదు.

సూపర్ స్టార్ మహేష్ బాబు స్టైలిష్ లుక్.. ఫిదా అవుతున్న నెటిజన్లు
Follow us on

సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. ముఖ్యంగా అమ్మాయిల్లో మహేష్ క్రేజ్ మాములుగా ఉండదు. మహేష్ విషయంలో వయసు అనేది కేవలం నెంబర్‌గానే ముగిలిపోతుంది. నాలుగు పదుల వయసులోనూ పాతికేళ్ల కుర్రాడిలా కనిపిస్తున్నాడు మహేష్. తాజాగా మహేష్ షేర్ చేసిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఈ ఫొటోలో మహేష్ మరింత హ్యాండ్సమ్‌గా సూపర్ స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ప్రముఖ ఫొటోగ్రాఫర్ అవినాష్ గోవారికర్‌ తీసిన ఫొటోను మహేష్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఓ యాడ్ షూట్ కోసం మహేష్ ఈ ఫోటోషూట్ లో పాల్గొన్నాడు. ఇక మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నాడు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుంది. జనవరి నుంచి ఈ మూవీ షూటింగ్ మొదలు కాబోతుంది.