కొలంబో దాడుల ఉగ్రవాదులకు కశ్మీర్, కేరళ, బెంగళూరుతో సంబంధాలు!

| Edited By:

May 04, 2019 | 6:28 PM

శ్రీలంకలో వరుస బాంబు పేలుళ్ల మూలాలు భారత్‌లోనూ ప్రకంపనలు రేపుతున్నాయి. భారత్‌లో ఐసిస్‌ మూలాలు బలంగా ఉన్నాయనే విషయాన్ని కొలంబో ఆత్మాహుతి దాడులు స్పష్టం చేస్తున్నాయి. శ్రీలంక రాజధానిలో ఈస్టర్ సందర్భంగా దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు శిక్షణ నిమిత్తం భారత్‌లోని కేరళ, బెంగళూరు, కశ్మీర్‌కు వచ్చివెళ్లినట్లు శ్రీలంక లెఫ్టినెంట్‌ జనరల్‌ మహేశ్‌ సేననాయకే వెల్లడించారు. బీబీసీ ప్రతినిధితో ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన ఈ విషయం వెల్లడించారు. ‘కొలంబో దాడులకు ముందు వారు భారత్‌ వెళ్లారు. అక్కడ బెంగళూరు, […]

కొలంబో దాడుల ఉగ్రవాదులకు కశ్మీర్, కేరళ, బెంగళూరుతో సంబంధాలు!
Follow us on

శ్రీలంకలో వరుస బాంబు పేలుళ్ల మూలాలు భారత్‌లోనూ ప్రకంపనలు రేపుతున్నాయి. భారత్‌లో ఐసిస్‌ మూలాలు బలంగా ఉన్నాయనే విషయాన్ని కొలంబో ఆత్మాహుతి దాడులు స్పష్టం చేస్తున్నాయి. శ్రీలంక రాజధానిలో ఈస్టర్ సందర్భంగా దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు శిక్షణ నిమిత్తం భారత్‌లోని కేరళ, బెంగళూరు, కశ్మీర్‌కు వచ్చివెళ్లినట్లు శ్రీలంక లెఫ్టినెంట్‌ జనరల్‌ మహేశ్‌ సేననాయకే వెల్లడించారు. బీబీసీ ప్రతినిధితో ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన ఈ విషయం వెల్లడించారు. ‘కొలంబో దాడులకు ముందు వారు భారత్‌ వెళ్లారు. అక్కడ బెంగళూరు, కేరళ, కశ్మీర్‌‌లో కొంత కాలం ఉన్నట్లు మావద్ద సమాచారం ఉంది. బహుశా వాళ్లు శిక్షణ కోసం వెళ్లి ఉండవచ్చు. లేదా ఐసిస్‌ తరఫున ఇతర ఉగ్రవాద గ్రూపులతో సంబంధాలు పెంచుకునే నిమిత్తం వెళ్లి ఉండవచ్చు’ అని సేననాయకే తెలిపారు.