ఓటీటీలో విడుదల కానున్న ‘కలర్ ఫోటో’..!

కరోనా వైరస్ కారణంగా థియేటర్లు ఎప్పుడు తెరుస్తారో.? ఎవరికి తెలియని పరిస్థితి నెలకొంది. దీనితో నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీ విడుదల చేసేందుకు సిద్దమవుతున్నారు.

ఓటీటీలో విడుదల కానున్న కలర్ ఫోటో..!

Updated on: Aug 28, 2020 | 3:33 PM

Colour Photo In OTT: కరోనా వైరస్ కారణంగా థియేటర్లు ఎప్పుడు తెరుస్తారో.? ఎవరికి తెలియని పరిస్థితి నెలకొంది. దీనితో నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీ విడుదల చేసేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే పెంగ్విన్, కృష్ణ అండ్ హిజ్ లీలా, భానుమతి & రామకృష్ణ మొదలగు సినిమాలు ఓటీటీ ద్వారా ప్రేక్షకులను అలరించగా.. తాజాగా నాని నటించిన ‘వి’, సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రాలు అమెజాన్ ప్రైమ్‌లో విడుదలకు సిద్దమవుతున్నాయి. (కరోనా చికిత్స.. ఆ రెండు టాబ్లెట్స్ కలిపి వాడితే ముప్పే..!)

ఇక ఇప్పుడు అదే బాటలో సుహాస్ హీరోగా నటించిన ‘కలర్ ఫోటో’ చిత్రం కూడా ఓటీటీలో రిలీజ్ కానుందని సమాచారం. ఈ సినిమాలో చాందినీ చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా.. కమెడియన్ సునీల్ విలన్‌గా నటిస్తున్నాడు.. సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కాళ భైరవ సంగీతం అందించాడు. కాగా, ఇప్పటికే రిలీజైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ ‘ఆహా’లో ఈ మూవీని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీనిపైన త్వరలోనే అధికారక ప్రకటన వెలువడనుంది.