స్టూడెంట్ ప్రాణం తీసిన ‘బర్త్‌డే బంప్స్’

| Edited By: Srinu

May 02, 2019 | 7:52 PM

బర్త్‌డే బంప్స్ పేరిట ఆ విద్యార్థులు రెచ్చిపోయారు. తమ సాటి విద్యార్థి అని కూడా చూడకుండా రౌడీల మాదిరిగా పుట్టినరోజు జరుపుకుంటోన్న ఓ స్టూడెంట్‌పై పిడిగుద్దులు కురిపించారు. ఈ దాడిలో ఆ విద్యార్థి మరణించాడు. ఆ స్టూడెంట్ బర్త్‌డే రోజున  అతనితో కేక్ కట్ చేయించిన స్నేహితులు బర్త్ డే బంప్స్ అంటూ చితకబాదారు. ఇది మరీ శృతిమించి మరుసటి రోజు తీవ్రమైన కడుపునొప్పితో ఆ విద్యార్థి ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. అయితే అప్పటికే శరీరంలో క్లోమ […]

స్టూడెంట్ ప్రాణం తీసిన ‘బర్త్‌డే బంప్స్’
Follow us on

బర్త్‌డే బంప్స్ పేరిట ఆ విద్యార్థులు రెచ్చిపోయారు. తమ సాటి విద్యార్థి అని కూడా చూడకుండా రౌడీల మాదిరిగా పుట్టినరోజు జరుపుకుంటోన్న ఓ స్టూడెంట్‌పై పిడిగుద్దులు కురిపించారు. ఈ దాడిలో ఆ విద్యార్థి మరణించాడు.

ఆ స్టూడెంట్ బర్త్‌డే రోజున  అతనితో కేక్ కట్ చేయించిన స్నేహితులు బర్త్ డే బంప్స్ అంటూ చితకబాదారు. ఇది మరీ శృతిమించి మరుసటి రోజు తీవ్రమైన కడుపునొప్పితో ఆ విద్యార్థి ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. అయితే అప్పటికే శరీరంలో క్లోమ గ్రంధి బాగా దెబ్బ తిన్నదని డాక్టర్లు తేల్చారు. చికిత్స చేసినప్పటికీ.. ఫలితం లేక ఆ విద్యార్థి కన్నుమూశాడు. రెండు నెలల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కాగా ఈ వీడియోను భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘‘ఇది చాలా బాధాకరం. బర్త్‌డే బంప్స్ వలన విద్యార్థి మరణించాడు. పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకోవడానికి ఇది మంచి పద్దతి కాదు. బాధ్యతగా ఉండండి. ప్రతి ఒక్కరికి ఇది ఫన్నీ కాదు’’ అంటూ పేర్కొన్నాడు. అయితే కొద్ది సేపటి తర్వాత ఆ పోస్ట్‌ను డిలీట్ చేశాడు. అంతలోపే పలువురు నెటిజన్లు ఈ ట్వీట్‌పై స్పందించారు.

https://twitter.com/virendersehwag/status/1123874567339032580