
పాపువా న్యూ గినీలో భారీ భూకంపం సంభవించింది. ఈ తీవ్రత మాగ్నిట్యూడ్‌పై 7.0గా నమోదయినట్లు అధికారులు వెల్లడించారు. పాపువా న్యూ గినీలోని పోపోండెట్టాకు ఉత్తర-వాయువ్య దిశలో భూమి కంపించినట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే పేర్కొంది. 80 కిలో మీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం నమోదైనట్లు పేర్కొంది. అయితే సునామీ హెచ్చరికల కేంద్రం మాత్రం 7.3 తీవ్రతతో బలమైన భూ ప్రకంపనలు గుర్తించినట్లు తెలిపారు.
పాపువా న్యూ గినీలో భారీగా భూ ప్రకంపనలు రావడంతో సునామీ ముప్పు కూడా పొంచి ఉన్నట్లు.. యూఎస్ పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఆ దేశ తీర ప్రాంతంలో 7.3 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు తెలిపింది. భూకంప కేంద్రం నుంచి 300 కి.మీ దూరం వరకు ప్రమాదకర సునామీ వచ్చే అవకాశాలున్నయాని హెచ్చరించింది.
Read More:
లద్ధాఖ్‌లో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. తుపాకీ ఎక్కు పెట్టి..