Sushant Singh Rajput : సినీ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ముంబై బాంద్రాలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన సూసైడ్ కి కారణం ఇంతవరకు తెలియలేదు. సుశాంత్ మృతికి అయిదు రోజులముందు ఆయన మాజీ మేనేజర్ దిశా సెలియన్ సూసైడ్ చేసుకున్న సంగతి విదితమే.’ పవిత్ర రిస్తా ‘ టీవీ సీరియల్ తో పాపులర్ అయిన సుశాంత్.. ‘కైపోచే’ మూవీతో తన సినీ ఆరంగ్రేట్రం చేశాడు. చివరిసారిగా ‘డ్రైవ్’ చిత్రంలో నటించాడు. కాగా దక్షిణ ఢిల్లీలోని ఆండ్రూస్ గంజ్‌లో ఉన్న స్ట్రెచ్ రోడ్డుకు సుశాంత్ పేరు పెట్టాలని నిర్ణయించారు. ఈ ప్రతిపాదనకు మున్సిపల్ అధికారులు సుశాంత్ సింగ్ పుట్టిన రోజు సందర్భంగా గురువారం ఆమోదించారు. రోడ్డుకు సుశాంత్ సింగ్ పేరు పెట్టాలని సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ కౌన్సిలర్ అభిషేక్ దత్ గతేడాది సెప్టెంబరులో ప్రతిపాదించారు. అక్కడి రోడ్డు నంబరు 8లో బీహార్‌కు చెందిన వారు నివసిస్తున్నారని, ఆండ్రూస్ గంజ్ నుంచి ఇందిరా క్యాంపునకు వెళ్లే రోడ్డుకు ‘సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మార్గ్’గా నామకరణం చేయాలని డిమాండ్ చేస్తున్నారని దత్ ఆ ప్రతిపాదనలో పేర్కొన్నారు. . ఈ ప్రతిపాదనను మున్సిపల్ అధికారులు ఆమోదం తెలిపారు.
మరిన్ని ఇక్కడ చదవండి :
తెరపైకి మరో క్రేజీ కాంబో.. ప్రభాస్‌ను ఢీ కొట్టబోతున్న సేతుపతి.? నిజమైతే ఫ్యాన్స్‌కు పూనకాలే..