ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం.. రక్తపు మడుగులో పసిబిడ్డ!

| Edited By:

Jan 16, 2020 | 4:09 PM

ప్రైవేటు ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా.. అభం శుభం తెలియని ఓ పసిబిడ్డ కన్నుమూసింది. ఆపరేషన్ థియేటర్‌లోకి వెళ్లిన ఓ కుక్క అప్పుడే పుట్టిన బిడ్డను చంపేసింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఫరూకాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఫరూకాబాద్‌కి చెందిన రవికుమార్ అనే వ్యక్తి తన భార్య కాంచనకు నొప్పులు రావటంతో ఆకాశ గంగ అనే ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. కాంచన పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు సిజేరియన్ చేశారు. అనంతరం ఆమెను వార్డుకు తరలించారు. […]

ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం.. రక్తపు మడుగులో పసిబిడ్డ!
Follow us on

ప్రైవేటు ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా.. అభం శుభం తెలియని ఓ పసిబిడ్డ కన్నుమూసింది. ఆపరేషన్ థియేటర్‌లోకి వెళ్లిన ఓ కుక్క అప్పుడే పుట్టిన బిడ్డను చంపేసింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఫరూకాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఫరూకాబాద్‌కి చెందిన రవికుమార్ అనే వ్యక్తి తన భార్య కాంచనకు నొప్పులు రావటంతో ఆకాశ గంగ అనే ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. కాంచన పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు సిజేరియన్ చేశారు. అనంతరం ఆమెను వార్డుకు తరలించారు. అయితే పసిబిడ్డను మాత్రం ఆపరేషన్ థియేటర్‌లోనే ఉంచారు. అయితే కొద్దిసేపటికి ఆపరేషన్‌ థియేటర్‌లో నుంచి కుక్క రావడం గమనించిన కొందరు గట్టిగా అరిచారు. హుటాహుటిన అందరూ వచ్చి చూడగా.. పసిబిడ్డ రక్తపు మడుగులో కింద పడిఉన్నాడు. బాబును పరీక్షించగా కుక్క గాయాలకు బిడ్డ కన్న మూశాడని తేల్చారు.

అయితే సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే.. బాబు మరణించాడని తండ్రి రవి కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో.. ఆస్పత్రి యాజమాన్యం.. గొడవచేయొద్దని, మీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తామని చెప్పారు. దీంతో పసిబిడ్డ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిర్లక్ష్యంగా వ్యవహరించి, పసిబిడ్డ చావుకు కారణమైన ఆస్పత్రి సిబ్బిందిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. అంతేకాకుండా.. సరైన పత్రాలు, లైసెన్స్ లేని కారణంగా ఆస్పత్రిని మూసివేయాలని ఫరూకాబాద్ జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు.