రంజాన్ ప్రార్థనలు చేస్తుండగా ఎద్దు బీభత్సం

| Edited By:

May 29, 2019 | 7:30 AM

ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో ఓ ఎద్దు బీభత్సం సృష్టించింది. సాధత్ గంజ్ ప్రాంతంలో రంజాన్ మాసం సందర్భంగా షియా ముస్లీంలు ప్రార్థనలు చేసుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా వచ్చిన ఓ ఎద్దు.. వారిపైకి దూసుకెళ్లింది. వెంటనే అప్రమత్తమైన అక్కడి వారు దానిని నిలువరించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయినా అది దాని కొమ్ములతో పొడుస్తూ దాడికి దిగింది. ఈ ఘటనలో మొత్తం 12మందికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో అంబులెన్స్‌ల ద్వారా క్షతగాత్రులను స్థానిక కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ ఆస్పత్రికి తరలించి […]

రంజాన్ ప్రార్థనలు చేస్తుండగా ఎద్దు బీభత్సం
Follow us on

ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో ఓ ఎద్దు బీభత్సం సృష్టించింది. సాధత్ గంజ్ ప్రాంతంలో రంజాన్ మాసం సందర్భంగా షియా ముస్లీంలు ప్రార్థనలు చేసుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా వచ్చిన ఓ ఎద్దు.. వారిపైకి దూసుకెళ్లింది. వెంటనే అప్రమత్తమైన అక్కడి వారు దానిని నిలువరించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయినా అది దాని కొమ్ములతో పొడుస్తూ దాడికి దిగింది. ఈ ఘటనలో మొత్తం 12మందికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో అంబులెన్స్‌ల ద్వారా క్షతగాత్రులను స్థానిక కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటన చోటుచేసుకుందని బాధితులు ఆరోపిస్తున్నారు.