Strain Virus: దేశంలో కొత్త ‘స్ట్రెయిన్’ విజృంభణ.. కొత్తగా మరో ఐదు కేసులు.. 25కు చేరిన సంఖ్య

|

Dec 31, 2020 | 11:33 AM

Strain Virus: యూకేలో వెలుగులోకి వచ్చిన కొత్తరకం కరోనా వైరస్ కేసులు భారతదేశంలోనూ పెరుగుతున్నాయి. నిన్నటి దాకా దేశంలో 20 'స్ట్రెయిన్' కేసులను..

Strain Virus: దేశంలో కొత్త స్ట్రెయిన్ విజృంభణ.. కొత్తగా మరో ఐదు కేసులు.. 25కు చేరిన సంఖ్య
Follow us on

Strain Virus: యూకేలో విజృంభిస్తున్న కొత్తరకం కరోనా వైరస్ భారతదేశంలోనూ వ్యాపిస్తోంది. ఇప్పటిదాకా దేశంలో 20 ‘స్ట్రెయిన్’ కేసులను అధికారికంగా గుర్తించిన ప్రభుత్వం.. తాజాగా మరో ఐదుగురికి ఈ వైరస్ సోకినట్లు నిర్ధారించింది. పూణేలో నాలుగు స్ట్రెయిన్ కేసులు, ఢిల్లీలో ఒక కేసును గుర్తించింది. దీనితో దేశంలో కరోనా కొత్తరకం వైరస్ కేసుల సంఖ్య 25కు చేరింది. జీనోమ్ స్వీక్వెన్సింగ్ ప్రయోగశాల వర్గాలు ఈ కేసులు గుర్తించడంతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా ధృవీకరించింది. కాగా, ప్రస్తుతం బాధితులు ఆయా రాష్ట్రాలలో ఐసోలేషన్‌లో ఉన్నట్లు కేంద్రం తెలిపింది. వారితో కాంటాక్ట్ అయినవారు, సన్నిహితులను గుర్తించి క్వారంటైన్‌కు పంపించేలా రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలు జారీ చేసినట్లు కేంద్రం పేర్కొంది.

Also Read:

తెలుగు రాష్ట్రాల ప్రజలకు పండుగ శుభవార్త.. ప్రత్యేక రైళ్లు పొడిగింపు.. పూర్తి వివరాలివే..!

వైఎస్సార్ రైతు భరోసా డబ్బు జమ కాలేదా.? అయితే ఈ నెంబర్‌కు కాల్ చేయండి.!

ట్యాక్స్ పేయర్స్‌కు గుడ్ న్యూస్.. మరోసారి ఐటీ రిటర్న్స్ గడువు పొడిగింపు

ఏపీ ప్రజలకు ఆర్టీసీ ఓ గుడ్ న్యూస్.. మరో బ్యాడ్ న్యూస్.. అదేంటంటే.!