శ్రీశైలం పవర్ ప్లాంట్‌ ఘటన.. మంటల్లో చిక్కుకున్న వారి వివరాలు..

|

Aug 21, 2020 | 3:10 PM

శ్రీశైలం పవర్ ప్లాంట్‌ ఘటనలో మొత్తం ఆరు మృతదేహాలు బయటపడ్డాయి. వారిలో ఒకరు AE సుందర్‌నాయక్‌గా అధికారులు గుర్తించారు. సుందర్‌నాయక్‌ది సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం జగన్‌తండా గ్రామం.

శ్రీశైలం పవర్ ప్లాంట్‌ ఘటన.. మంటల్లో చిక్కుకున్న వారి వివరాలు..
Follow us on

Srisailam Fire Accident: శ్రీశైలం పవర్ ప్లాంట్‌ ఘటనలో మొత్తం ఆరు మృతదేహాలు బయటపడ్డాయి. వారిలో ఒకరు AE సుందర్‌నాయక్‌గా అధికారులు గుర్తించారు. సుందర్‌నాయక్‌ది సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం జగన్‌తండా గ్రామం. మిగతావారి వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటివరకు ఈ ప్రమాదంలో ఆరుగురు చనిపోవడంతో ఉద్యోగుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సొరంగంలో చిక్కుకున్న మిగతా ముగ్గురి కోసం గాలింపు కొనసాగుతోంది. మొత్తం 9 మంది ఈ ప్రమాదంలో చిక్కుకుపోయారు.

శ్రీశైలం పవర్‌ ప్రాజెక్ట్‌లో సహాయక చర్యలు రెస్క్యూ టీమ్‌కు కత్తి మీద సాములా మారాయి. పొగ తీవ్రత ఏ మాత్రం తగ్గలేదు. దాంతో లోపలకు వెళ్లేందుకు సిబ్బంది విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. 35 మందితో ప్రత్యేక టీమ్‌ అక్కడికి వచ్చింది. మూడో ఫ్లోర్‌ వరకు వెళ్లారు. అక్కడి నుంచి లోపలికి వెళ్లలేకపోతున్నారు. లోపల చిక్కుకుపోయిన వారిలో ఇప్పటివరకు ఆరు మృతదేహాలు బయట పడ్డాయి. మరో ముగ్గురి ఆచూకీ దొరకలేదు. జీరో లెవల్‌ నుంచి సర్వీస్‌ బే వరకు పొగలు కమ్ముకున్నాయి.

మెయిన్‌ ఎంట్రన్స్‌ కాకుండా పవర్‌ ప్రాజెక్ట్‌కు రెండు ఎస్కేప్‌ టన్నెల్స్‌ ఉన్నాయి. అక్కడ నుంచి కూడా పొగ పెద్దఎత్తున వస్తోంది. లోపల నుంచి అర కిలోమీటరు దూరం నడుచుకుంటూ వస్తే… ఉద్యోగులు బయటపడొచ్చు. కానీ పొగ తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి మిగతా ఉద్యోగులు బయటకు రావడం అంత ఈజీ కాదన్నది నిపుణుల అంచనా. అందువల్లే సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. మొత్తం ఐదు అంతస్తులు పవర్‌ హౌస్‌లో ఉన్నాయి. మూడో అంతస్తు కింద వరకు వెళ్లారు. 4, 5 ఫ్లోర్లకు వెళ్లలేకపోతున్నారు. ఉద్యోగులేమైనా అక్కడ చిక్కుకుపోయారా? అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. లోపల చిక్కుకుపోయిన వారిలో AE వెంకట్రావుతో సహాయ మిగిలిన వారి ఫోన్లు స్విచ్‌ ఆఫ్‌లో ఉన్నాయి.

మంటల్లో చిక్కుకున్న వారి వివరాలు ఇలా ఉన్నాయి..

  • DE శ్రీనివాస్ గౌడ్, హైదరాబాద్
  • AE వెంకట్‌రావు, పాల్వంచ
  • AE మోహన్ కుమార్, హైదరాబాద్
  • AE ఉజ్మ ఫాతిమా, హైదరాబాద్
  • AE సుందర్, సూర్యాపేట
  • ప్లాంట్ అటెండెంట్ రాంబాబు, ఖమ్మం జిల్లా
  • జూనియర్ ప్లాంట్ అటెండెంట్ కిరణ్, పాల్వంచ
  • ఇంకా హైదరాబాద్‌కు చెందిన అమరన్ బ్యాటరీ కంపెనీ సిబ్బంది వినేష్ కుమార్, మహేష్ కుమార్‌లుగా తెలుస్తోంది.

Also Read:

”భారత్‌లో డిసెంబర్ 3 నాటికి కరోనా అంతం”

కరోనా సోకినట్లయితే.. మొదటిగా కనిపించే లక్షణం ఇదే..!

కలియుగ కర్ణుడికి ఒక్క రోజే 31 వేల మెసేజ్‌లు..

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ స్కూళ్లకు ఇంటర్నెట్..