మొన్న జరిగిన ఎన్నికలతో ఎన్టీఆర్ ఆత్మ శాంతించింది: లక్ష్మీపార్వతి

దివంగత నేత, నట సార్వభౌముడు, మాజీ సీఎం నందమూరి తారక రామారావు 24వ వర్థంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించారు లక్ష్మీ పార్వతి. ఈ సందర్భంగా కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు. మొన్న జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు ఓటమితో స్వర్గీయ ఎన్టీఆర్ ఆత్మ శాంతించిందని పేర్కొన్నారు లక్ష్మీ పార్వతి. తెలుగు జాతికి ఇదో దుర్దినమైన రోజని.. ఎన్నో గుండెలు ఈరోజు ఆగిపోయాయని ఆవిడ అన్నారు. అన్యాయంగా కొంతమంది ఎన్టీఆర్‌ని అధికారం నుంచి తొలగించి, ఆయన చనిపోవడానికి కారణమయ్యారని వ్యాఖ్యానించారు. […]

  • Updated On - 12:05 pm, Sat, 18 January 20 Edited By:
మొన్న జరిగిన ఎన్నికలతో ఎన్టీఆర్ ఆత్మ శాంతించింది: లక్ష్మీపార్వతి

దివంగత నేత, నట సార్వభౌముడు, మాజీ సీఎం నందమూరి తారక రామారావు 24వ వర్థంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించారు లక్ష్మీ పార్వతి. ఈ సందర్భంగా కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు. మొన్న జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు ఓటమితో స్వర్గీయ ఎన్టీఆర్ ఆత్మ శాంతించిందని పేర్కొన్నారు లక్ష్మీ పార్వతి. తెలుగు జాతికి ఇదో దుర్దినమైన రోజని.. ఎన్నో గుండెలు ఈరోజు ఆగిపోయాయని ఆవిడ అన్నారు. అన్యాయంగా కొంతమంది ఎన్టీఆర్‌ని అధికారం నుంచి తొలగించి, ఆయన చనిపోవడానికి కారణమయ్యారని వ్యాఖ్యానించారు. చివరినిమిషాల్లో ఎన్టీఆర్ పడ్డ బాధ, ఆవేదన నాకు ఒక్క దానికి మాత్రమే తెలుసన్నారు. కాగా.. ఎన్టీఆర్‌ మహిళలను ఎంతగానో గౌరవించేవారని, కానీ ఈరోజుల్లో మహిళలకు అసలు గౌరవం దక్కడంలేదని లక్ష్మీ పార్వతి వ్యాఖ్యానించారు.