మా స్పుత్నిక్ వీ వ్యాక్సీన్ 92 శాతం మేలైనది, రష్యా

మా స్పుత్నిక్ వీ వ్యాక్సీన్ 92 శాతం మేలైనది, రష్యా

తమ స్పుత్నిక్ వీ వ్యాక్సీన్ 92 శాతం మేలైనదని రష్యా ప్రకటించింది. కరోనావైరస్ చికిత్సలో ఈ టీకామందు అద్భుతంగా పని చేస్తుందని, తమ ట్రయల్స్ ఈ విషయాన్ని ధృవీకరించాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ వ్యాక్సీన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్  బెలారస్, యూఏఈ, వెనిజులా తో బాటు ఇండియాలో కూడా కొనసాగుతున్నాయని రష్యన్ అధికారులు తెలిపారు. ఈ ట్రయల్స్ సందర్భంగా ఎలాంటి దుష్పరిణామాలు ఎదురు కాలేదని వారు చెప్పారు. ఇప్పటికే పలు దేశాల్లో రెండు, మూడో […]

Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Nov 11, 2020 | 8:06 PM

తమ స్పుత్నిక్ వీ వ్యాక్సీన్ 92 శాతం మేలైనదని రష్యా ప్రకటించింది. కరోనావైరస్ చికిత్సలో ఈ టీకామందు అద్భుతంగా పని చేస్తుందని, తమ ట్రయల్స్ ఈ విషయాన్ని ధృవీకరించాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ వ్యాక్సీన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్  బెలారస్, యూఏఈ, వెనిజులా తో బాటు ఇండియాలో కూడా కొనసాగుతున్నాయని రష్యన్ అధికారులు తెలిపారు. ఈ ట్రయల్స్ సందర్భంగా ఎలాంటి దుష్పరిణామాలు ఎదురు కాలేదని వారు చెప్పారు. ఇప్పటికే పలు దేశాల్లో రెండు, మూడో దశ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. దీన్ని తీసుకున్న వలంటీర్లలో  ఎవరికీ ఏ సమస్యా కలగలేదని వారు పేర్కొన్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu