సెంచరీ కొట్టిన స్పైస్‌జెట్

ప్రైవేటు విమానయాన సంస్థ స్పైస్‌జెట్ లోకి బోయింగ్ 737 వచ్చి చేరింది. దీంతో స్పైస్‌జెట్ విమానాల సంఖ్య వందకు చేరుకుంది. ప్రభుత్వం రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా, సంక్షోభంలో చిక్కుకుపోయి సేవలను నిలిపివేసిన జెట్‌ ఎయిర్‌‌వేస్, ఇండిగో తర్వాత ఆ స్థాయిలో విమానాలు కలిగిన నాలుగో అతిపెద్ద సంస్థగా స్పైస్‌జెట్ రికార్డులకెక్కింది. ప్రస్తుతం ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్‌జెట్, గోఎయిర్, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, విస్తారా, ఎయిర్ ఏషియా వంటి దేశీయ విమానయాన సంస్థల వద్ద […]

  • Tv9 Telugu
  • Publish Date - 8:59 pm, Sun, 26 May 19
సెంచరీ కొట్టిన స్పైస్‌జెట్

ప్రైవేటు విమానయాన సంస్థ స్పైస్‌జెట్ లోకి బోయింగ్ 737 వచ్చి చేరింది. దీంతో స్పైస్‌జెట్ విమానాల సంఖ్య వందకు చేరుకుంది. ప్రభుత్వం రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా, సంక్షోభంలో చిక్కుకుపోయి సేవలను నిలిపివేసిన జెట్‌ ఎయిర్‌‌వేస్, ఇండిగో తర్వాత ఆ స్థాయిలో విమానాలు కలిగిన నాలుగో అతిపెద్ద సంస్థగా స్పైస్‌జెట్ రికార్డులకెక్కింది.

ప్రస్తుతం ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్‌జెట్, గోఎయిర్, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, విస్తారా, ఎయిర్ ఏషియా వంటి దేశీయ విమానయాన సంస్థల వద్ద ఉన్న మొత్తం విమానాల సంఖ్య 595కి చేరుకుంది. కాగా, స్పైస్‌జెట్ గత నెలలో ఏకంగా 23 విమానాలను కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఈ బడ్జెట్ ఎయిర్‌లై‌న్‌లో 68 బోయింగ్ 737 విమానాలు, 30 బంబార్డియర్ క్యూ-400ఎస్, రెండు బి737 విమానాలు ఉన్నాయి.