చనిపోయిన వ్యక్తి వీర్యంతో పిల్లలు…!
చనిపోయిన వ్యక్తి వీర్యంతో పిల్లలు పుట్టించొచ్చా..? అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. జర్నల్ ఆఫ్ మెడికల్ ఎథిక్స్’లో ప్రచురితమైన ఓ పరిశోధన ఇప్పుడు చాలా మందిని ఆశ్యర్యచకితులను చేస్తోంది. స్పెర్మ్ బ్యాంక్‌లో చనిపోయిన వ్యక్తి వీర్యాన్ని నిల్వ చేసుకోచ్చు, అలా వీలు కానీ పరిస్థితుల్లో చనిపోయిన 48 గంటల లోపు ఆ వీర్యాన్ని గర్బాధారణకి ఉపయోగించొచ్చని సైంటిస్టులు చెప్తున్నారు. చనిపోయిన వ్యక్తి నుంచి వీర్యం తీసేందకు రెండు పద్దతులు ఉన్నాయి. ప్రొస్టేట్ గ్రంధి ఎలక్ట్రికల్ సిమ్యూలేషన్ లేదా ఆఫరేషన్ […]
చనిపోయిన వ్యక్తి వీర్యంతో పిల్లలు పుట్టించొచ్చా..? అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. జర్నల్ ఆఫ్ మెడికల్ ఎథిక్స్’లో ప్రచురితమైన ఓ పరిశోధన ఇప్పుడు చాలా మందిని ఆశ్యర్యచకితులను చేస్తోంది. స్పెర్మ్ బ్యాంక్‌లో చనిపోయిన వ్యక్తి వీర్యాన్ని నిల్వ చేసుకోచ్చు, అలా వీలు కానీ పరిస్థితుల్లో చనిపోయిన 48 గంటల లోపు ఆ వీర్యాన్ని గర్బాధారణకి ఉపయోగించొచ్చని సైంటిస్టులు చెప్తున్నారు. చనిపోయిన వ్యక్తి నుంచి వీర్యం తీసేందకు రెండు పద్దతులు ఉన్నాయి. ప్రొస్టేట్ గ్రంధి ఎలక్ట్రికల్ సిమ్యూలేషన్ లేదా ఆఫరేషన్ చేసి వీర్యకణాలను సేకరించవచ్చు. వాటితో ఆరోగ్యంగా ఉండే పిల్లల్ని పుట్టించొచ్చట. స్పెర్మ్ డొనేషన్‌కి సంబంధించి చాలా దేశాల్లో నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయి. దీంతో బ్యాంకుల్లో స్పెర్మ్ కౌంట్ బాగా తగ్గిపోయింది.
అయితే చనిపోయిన వ్యక్తి వీర్యకణాలను సేకరించే క్రమంలో కొన్ని చిక్కులు కూడా ఉన్నాయి. డోనర్ కన్సెంట్ ఉండదు. కుటుంబ సభ్యుల మధ్య భిన్నాబిప్రాయాలు వ్యక్తమవ్వొచ్చు. దాత గోప్యత కూడా ఇక్కడ ప్రధాన విషయం. కుటుంబ వృద్ది కోసం కాకుండా అవయవదానంలాగా భావిస్తే..చనిపోయిన వ్యక్తి వీర్యంతో మెరుగైన ఫలితాలు రాబట్టొచ్చని సైంటిస్టుల అభిప్రాయం.