విశాఖ గ్యాస్ లీక్ : బాధిత గ్రామాల ప్ర‌జ‌ల‌కు ప్రత్యేక హెల్త్ కార్డులు..

|

May 12, 2020 | 11:00 PM

విశాఖ గ్యాస్ లీకేజీ ప్రభావిత గ్రామ ప్రజలకు స్పెష‌ల్ హెల్త్ కార్డులు ఇస్తామని మంత్రి క‌న్న‌బాబు స్పష్టం చేశారు. లీకేజీ బాధితులు కేజీహెచ్‌లో ఎన్ని రోజులైనా ఉండి ట్రీట్మెంట్ తీసుకోవ‌చ్చ‌ని… వారికి నాణ్యమైన వైద్య సేవ‌లు అందిస్తామ‌ని భ‌రోసా ఇచ్చారు. బాధిత గ్రామాల ప్రజలు రాబోయే ఏడాది పాటు వైద్య సేవలు కోరుకుంటున్నారని… అందుకు త‌గ్గ‌ట్లుగా వారికి స్పెష‌ల్ హెల్త్ కార్డ్ ఇచ్చే ప్రక్రియను కూడా చేపడుతున్నామని వెల్ల‌డించారు. పాలిమర్ బాధితులకు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలో ఇప్పటికే అవకాశం […]

విశాఖ గ్యాస్ లీక్ : బాధిత గ్రామాల ప్ర‌జ‌ల‌కు ప్రత్యేక హెల్త్ కార్డులు..
Follow us on

విశాఖ గ్యాస్ లీకేజీ ప్రభావిత గ్రామ ప్రజలకు స్పెష‌ల్ హెల్త్ కార్డులు ఇస్తామని మంత్రి క‌న్న‌బాబు స్పష్టం చేశారు. లీకేజీ బాధితులు కేజీహెచ్‌లో ఎన్ని రోజులైనా ఉండి ట్రీట్మెంట్ తీసుకోవ‌చ్చ‌ని… వారికి నాణ్యమైన వైద్య సేవ‌లు అందిస్తామ‌ని భ‌రోసా ఇచ్చారు. బాధిత గ్రామాల ప్రజలు రాబోయే ఏడాది పాటు వైద్య సేవలు కోరుకుంటున్నారని… అందుకు త‌గ్గ‌ట్లుగా వారికి స్పెష‌ల్ హెల్త్ కార్డ్ ఇచ్చే ప్రక్రియను కూడా చేపడుతున్నామని వెల్ల‌డించారు. పాలిమర్ బాధితులకు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలో ఇప్పటికే అవకాశం కల్పించిన విషయాన్ని గుర్త చేశారు.

ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీలో ప్రమాదానికి గురైన స్టైరిన్ ట్యాంక్ వద్ద కొంత ప్రభావం ఉందని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. మెడికల్ నిపుణుల కమిటీని 10 మంది డాక్ట‌ర్ల‌తో ఏర్పాటు చేశామని వివరించారు. స్టైరిన్‌పై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని సీఎం చెప్పార‌ని, అన్ని గ్రామాల్లో నెల రోజుల పాటు మెడికల్ క్యాంప్ ఉంటుందని తెలిపారు. వైఎస్సార్ క్లీనిక్‌ను శాశ్వతంగా వెంకటాపురంలో ఏర్పాటు చేస్తామని హామి ఇచ్చారు.