గుడ్ న్యూస్: కేరళలోకి ‘నైరుతి’..! త్వరలో తెలుగు రాష్ట్రాలకు ఆగమనం..

| Edited By:

May 31, 2020 | 11:42 AM

ఓవైపు కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. మరోవైపు.. కరోనా లాక్‌డౌన్ కారణంగా వాయు కాలుష్యం తగ్గి.. వాతావరణంలో వేడి కూడా తగ్గింది. ఫలితంగా నైరుతి రుతుపవనాలు కేరళను తాకినట్లు తెలుస్తోంది.

గుడ్ న్యూస్: కేరళలోకి ‘నైరుతి’..! త్వరలో తెలుగు రాష్ట్రాలకు ఆగమనం..
Follow us on

Southwest monsoon: ఓవైపు కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. మరోవైపు.. కరోనా లాక్‌డౌన్ కారణంగా వాయు కాలుష్యం తగ్గి.. వాతావరణంలో వేడి కూడా తగ్గింది. ఫలితంగా నైరుతి రుతుపవనాలు కేరళను తాకినట్లు తెలుస్తోంది. కేరళతో సహా ఉత్తర భారతదేశంలోని ప‌లు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీ, ఎన్‌సీఆర్‌ల‌లో శనివారం భారీ వర్షాలు కురిశాయి. వాతావ‌ర‌ణ విభాగం తెలిపిన వివ‌రాల ప్రకారం రాబోయే 24 గంటల్లో మధ్య-తూర్పు అరేబియా సముద్రంలో అల్ప పీడన ద్రోణి ఏర్పడే అవకాశం ఉంది.

కాగా.. జూన్ 1న నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయని భారత వాతావరణ అధికారులు చెప్పగా… అవి ఆల్రెడీ కేరళ తీరాన్ని ఇప్పటికే తాకేశాయని స్కై మేట్ అనే ఓ ప్రైవేట్ సంస్థ తెలిపింది. కేరళలో గత 3-4 రోజులుగా కురుస్తున్న వర్షాలు, లాంగ్‌వేవ్‌ రేడియేషన్‌, గాలి దిశ మార్పును పరిగణనలోకి తీసుకొని ఈ విషయాన్ని నిర్ధారించినట్టు స్కైమెట్‌ సీఈవో తెలిపారు. వర్షాకాలం ప్రారంభమైనట్టేనని ప్రకటించారు. ‘హ్యాపీ మాన్‌సూన్‌’ అంటూ ట్విటర్‌లో రైతులకు శుభాకాంక్షలు తెలిపారు.

మరోవైపు.. కేరళలో రుతుపవనాల ప్రవేశాన్ని భారత వాతావరణశాఖ ధ్రువీకరించలేదు. రాగల 48గంటల్లో ఆగ్నేయ, దానికి ఆనుకుని తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఆ తరువాత 48 గంటల్లో ఉత్తర వాయువ్యంగా పయనించి వాయుగుండంగా బలపడుతుంది. దీని ప్రభావంతో 1న కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

[svt-event date=”31/05/2020,11:06AM” class=”svt-cd-green” ]