అన్నదాతలు చేస్తున్న ఆందోళనపై ఆవేదన వ్యక్తం చేసిన సోనూసూద్.. పొలం సాగుచేయాల్సిన రైతులు చలికి వణుకుతూ ఇలా..

|

Dec 19, 2020 | 10:39 AM

అన్నదాతల ఆగ్రహ జ్వాలలు కొనసాగుతూనే ఉన్నాయి. కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలు రైతులకు నష్టం చేసేవిగా ఉన్నాయని వాటిని వెంటనే రద్దు చేయాలనీ రైతు సంఘాలు నిరసన చేస్తున్న విషయం తెల్సిందే.

అన్నదాతలు చేస్తున్న ఆందోళనపై ఆవేదన వ్యక్తం చేసిన సోనూసూద్.. పొలం సాగుచేయాల్సిన రైతులు చలికి వణుకుతూ ఇలా..
Follow us on

అన్నదాతల ఆగ్రహ జ్వాలలు కొనసాగుతూనే ఉన్నాయి. కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలు రైతులకు నష్టం చేసేవిగా ఉన్నాయని వాటిని వెంటనే రద్దు చేయాలనీ రైతు సంఘాలు నిరసన చేస్తున్న విషయం తెల్సిందే. శనివారంతో రైతుల ఆందోళన 24వ రోజుకు చేరింది. ఇప్పటికే పలువురు ప్రముఖులు, క్రీడాకారులు, సినిమా తారలు, విపక్ష నేతలు రైతులకు మద్దతు తెలుపుతున్నారు. తాజాగా నటుడు సోనూసూద్ రైతుల నిరసన పై స్పందించారు.

ఢిల్లీలో అన్నదాతలు చేస్తున్న ఆందోళనపై సోనూసూద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఓ కార్యక్రమంలో సోనూ మాట్లాడుతూ.. రైతులను చూస్తుంటే బాధగా ఉందన్నారు. ” ఈ ఆందోళనలో ఎవరిది తప్పు.. ఎవరిది ఒప్పు అని నేను చెప్పాలనుకోవడంలేదు. ప్రభుత్వం రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుకుంటున్నాను. ఈ పోరాటంలో కొందరు రైతులు ప్రాణాలు కూడా కోల్పోయారని అన్నారు. నాకు రైతులతో మంచి అనుబంధం ఉంది.  పొలాల్లో సాగు చేస్తూ ఉండాల్సిన రైతులు ఇలా చలికి వణుకుతూ..కుటుంబంతో సహా రోడ్ల పైన ఉన్నారు.  ఇంకా ఎన్నిరోజులు రైతులు ఈ పరిస్థితుల్లో ఉంటారో తెలియడం లేదు. వారిని చూస్తుంటే బాధగా ఉంది”. అని సోనూసూద్ అన్నారు.