Sonu Sood In Sucess Meet: కరోనా సంక్షోభ సమయంలో ఎంతో మంది వలస కూలీలకు అండగా నిలిచి రియల్ హీరోగా మారాడు నటుడు సోనూసూద్. సినిమాల్లో విలన్‌గా నటించే సోనూసూద్‌కు నిజ జీవితంలో జనాలు ఏకంగా గుడులు కట్టి పూజిస్తున్నారు. ఇక కరోనా తర్వాత సోనుసూద్‌కు సంబంధించిన ఏ చిన్న వార్తయినా వైరల్‌గా మారుతోంది.
ఇదిలా ఉంటే తాజాగా సోనూసూద్ తెలుగులో బెల్లంకొండ శ్రీను హీరోగా తెరకెక్కిన ‘అల్లుడు అదుర్స్’ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం కలెక్షన్ల పరంగా దూసుకెళుతోంది. దీంతో తాజాగా చిత్ర యూనిట్ సక్సెస్‌మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా వేదికపై మాట్లాడిన సోనుసూద్ తెలుగు ఇండస్ట్రీపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోనూ మాట్లాడుతూ.. ‘నేను బాలీవుడ్, తమిళ ఇండస్ట్రీ.. ఇలా ఏ వేదికపై ఉన్నా తెలుగు ఇండస్ట్రీనే నాకు మొదటి ప్రేమ అని కచ్చితంగా చెబుతాను. నేను సినిమాల్లో నేర్చుకుంది ఏదైనా ఉందంటే అది తెలుగు ఇండస్ట్రీ ద్వారానే. కాబట్టి తెలుగు సినిమాకు నా ధన్యవాదాలు. నా భార్య తెలుగు ప్రాంతానికి చెందిన వ్యక్తి.. కాబట్టి నేను తెలుగు అల్లుడిని’ అంటూ వ్యాఖ్యానించాడు. ఇక నిర్మాత బెల్లంకొండ సురేష్ గురించి మాట్లాడుతూ.. ‘మీరు కథ చెప్పకున్నా సరే ఫోన్ చేసి సినిమా ఉందని చెబితే చాలు వచ్చేస్తా’ అంటూ చెప్పుకొచ్చాడు.
Also Read: Sonu Sood Tailor Shop: టైలరింగ్ షాప్ ఓపెన్ చేసిన సోనూ సూద్.. బట్టలు కుట్టడంలో గ్యారెంటీ లేదు