సోనూసూద్ గొప్ప మనసు.. బాలుడి వైద్యానికి రూ. 20 లక్షల సాయం..

|

Oct 02, 2020 | 5:34 PM

సాయానికి మరో పేరుగా మారిపోయిన సోనూ.. తాజాగా మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. హర్షవర్ధన్(6) అనే బాలుడి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ నిమిత్తం..

సోనూసూద్ గొప్ప మనసు.. బాలుడి వైద్యానికి రూ. 20 లక్షల సాయం..
Follow us on

Sonu Sood Helps 6 Years Boy: ఎక్క‌డ ఆప‌ద ఉన్నా క్ష‌ణాల్లో సాయం చేసేందుకు ముందుకొస్తున్నాడు. కష్టం అనే మాట వినిపిస్తే చాలు వెంటనే స్పందిస్తున్నాడు. లాక్‌డౌన్‌ మొదలైన నాటి నుంచి ఎందరికో సాయం చేస్తూ రీల్ విలన్‌ నుంచి యావత్ భారతదేశానికి రియల్‌ హీరోగా మారిపోయాడు నటుడు సోనూసూద్. సాయానికి మరో పేరుగా మారిపోయిన సోనూ.. తాజాగా మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. హర్షవర్ధన్(6) అనే బాలుడి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ నిమిత్తం రూ. 20 లక్షల ఆర్ధిక సాయం చేసేందుకు సోనూసూద్ ముందుకు వచ్చాడు.

Also Read: గ్రామ/వార్డు వాలంటీర్లకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..

మహబూబాబాద్‌ జిల్లా పెరుమాండ్ల సంకీస గ్రామానికి చెందిన నాగరాజు, లక్ష్మీ దంపతుల కుమారుడు హర్షవర్దన్ ఆరున్నర నెలల నుంచే కాలేయానికి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నాడు. అప్పటి నుంచి బాలుడికి మందులు వాడుతూ వస్తున్నారు. అయితే తాజాగా అతడి పరిస్థితి విషమించడంతో.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. బాలుడికి కాలేయ మార్పిడి ఆపరేషన్ చేయాలని.. ఇందుకు రూ. 20 లక్షల ఖర్చు అవుతుందని అక్కడి వైద్యులు చెప్పారు. వారి దగ్గర అంత స్థోమత లేకపోవడంతో సహాయం కోసం సోనూసూద్‌ను కలవాలని అనుకున్నారు.

ఇటీవల సోనూసూద్ షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ రావడంతో అక్కడికి వెళ్లి నాగరాజు దంపతులు కలుసుకున్నారు. తన కుమారుడి సమస్యను సోనూసూద్‌కు వివరించి సాయం చేయాలంటూ కోరారు. దీనికి వెంటనే స్పందించిన సోనూసూద్ బాలుడి వైద్యానికి అవసరమయ్యే రూ. 20 లక్షలు తానే భరిస్తానని ప్రకటించాడు.

Also Read: శభాష్ సాయి తేజ్.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సుప్రీమ్ హీరో..