Sonu Sood Helping Hand: సాయానికి మరో పేరు నటుడు సోనూసూద్. కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో అతడు వలస కార్మికులకు, విద్యార్థులకు, పేదవాళ్లకు చేసిన సాయం వెలకట్టలేనిది. ఎవరైనా సరే కష్టాల్లో ఉన్నామంటే చాలు.. వారి పట్ల నేనున్నానంటూ సోనూసూద్ ముందుకు వస్తున్నాడు. రీల్ విలన్ నుంచి యావత్ భారతదేశానికి రియల్ హీరోగా మారిన సోనూసూద్.. తాజాగా మరో మంచి పనికి శ్రీకారం చుట్టాడు.
ఈరోజు తన తల్లి సరోజ్ సూద్ వర్ధంతి సందర్భంగా.. ఆమె జ్ఞాపకార్ధంగా ఐఏఎస్ అభ్యర్థులకు స్కాలర్ షిప్‌లు అందివ్వనున్నట్లు ప్రకటించాడు. తన తల్లి సరోజ్ సూద్ పేరు మీదగా పేదరికంలో ఉండి ఐఏఎస్‌కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు.. తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి సహాయం చేస్తానని చెప్పాడు. స్కాలర్ షిప్‌ల కోసం www.schoollifyme.com సైట్‌లో అప్లై చేయాలని సోనూసూద్ సూచించాడు.
October 13; 13 years since My Mother passed. She left behind a legacy of Education. On her anniversary today, I pledge to support IAS aspirants reach their goals thru Prof Saroj Sood Scholarships. Seeking blessings ? Miss you maa. @Scholifyme pic.twitter.com/vxcIYte7NZ
— sonu sood (@SonuSood) October 13, 2020