తల్లిని చంపిన కొడుకు అరెస్ట్

|

Jun 16, 2020 | 3:59 PM

కన్నతల్లిని కడతేర్చాడు ఓ కసాయి కొడుకు. జూన్ 4 వ తేదీన జరిగిన మర్డర్ కేసును నెల్లూరు జిల్లా పోలీసులు ఛేదించారు. తల్లిని చంపి తప్పించు తిరుగుతున్న వ్యక్తిని ముత్తుకూరు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.

తల్లిని చంపిన కొడుకు అరెస్ట్
Follow us on

అన్నకు వత్తాసు పలుకుతుందని కన్నతల్లిని కడతేర్చాడు ఓ కసాయి కొడుకు. జూన్ 4 వ తేదీన జరిగిన మర్డర్ కేసును నెల్లూరు జిల్లా పోలీసులు ఛేదించారు. తల్లిని చంపి తప్పించు తిరుగుతున్న వ్యక్తిని ముత్తుకూరు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.
నెల్లూరు రూరల్‌ పరిధిలోని చేజర్ల మండలం తూర్పుకంభంపాడుకు చెందిన తలపల రమణయ్య, భార్య రమణమ్మలు బాతులు మేపుతూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు చెంచురామయ్య, రెండో కొడుకు వెంకటేశ్వర్లు. మద్యం మత్తులో చెంచురామయ్య తన తమ్ముడు వెంకటేశ్వర్లు భార్య విజయమ్మను లైంగికంగా వేధించేవాడు. ఈ క్రమంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య నిత్యం గొడవ జరుగుతున్నాయి. ఇదే విషయాన్ని వెంకటేశ్వర్లు పలుమార్లు తల్లి రమణమ్మకి చెప్పిన ఫలితం లేకపోయింది. ఆమె వెంకటేశ్వర్లును తిట్టి, పెద్దకొడుకునే సపోర్ట్‌ చేసింది.
ఇదే క్రమంలో జూన్ 4వ తేదీన వీరంతా మండలంలోని పొట్టెంపాడు సమీపంలోని సర్వేపల్లి రిజర్వాయర్‌ వద్దకు బాతులను మేపుకుంటూ వెళ్లారు. ఇక్కడ కూడా అన్నదమ్ములు తీవ్రంగా ఘర్షణ పడ్డారు. అయినా రమణమ్మ పెద్దకొడుకునే సమర్థించింది. దీంతో ఆగ్రహించిన వెంకటేశ్వర్లు కత్తితో తల్లి మెడ నరికి చంపేశాడు. నిందితుడు తల్లి శవాన్ని అక్కడి మిట్టకాలువ తూములో పడేసి పరారయ్యాడు. జూన్ 5వ తేదీన హత్య కేసుగా నమోదు చేశామని నెల్లూరు రూరల్ డీఎస్పీ హరినాథరెడ్డి తెలిపారు. ప్రాథమికంగా దొరికిన ఆధారలతో దర్యాప్తు చేపట్టి నిందితుడు వెంకటేశ్వర్లును అరెస్ట్ చేశామన్నారు. కేసు త్వరగా ఛేదించిన కృష్ణపట్నం సీఐ షేక్‌ ఖాజావలీ, ఎస్సై అంజిరెడ్డి, హెడ్‌కానిస్టేబుల్‌ అశోక్‌లను డీఎస్పీ అభినందించారు.