తండ్రి శవాన్ని సైకిల్‌పై తోసుకెళ్తున్న తనయుడు

కర్నాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు, స్థానికులు, అధికారులు నిరాకరించడంతో తనయుడే తండ్రి శవాన్ని సైకిల్‌పై తోసుకెళ్లాడు.

తండ్రి శవాన్ని సైకిల్‌పై తోసుకెళ్తున్న తనయుడు
Follow us

|

Updated on: Aug 17, 2020 | 8:39 PM

మానుషుల్లో మానవత్వం మంటగలుస్తోంది. ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా మనుషుల్లో మార్పురావడంలేదు. కర్నాటకలో దారుణం జరిగింది. కరోనా కారణంగా మృతి చెందిన వృద్ధుడి దగ్గరకు వచ్చేందుకు మనషులే కరువయ్యారు. కన్నకొడుకు ఒక్కడే ఆ తండ్రికి దిక్కయ్యాడు.కర్నాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు, స్థానికులు, అధికారులు నిరాకరించడంతో తనయుడే తండ్రి శవాన్ని సైకిల్‌పై తోసుకెళ్లాడు. బెళగావి జిల్లా కిత్తూరు తాలూకా ఎం.కె.హుబ్బళ్లి గ్రామంలోని గాంధీనగర్ లో జరిగిన ఈ ఘటన సభ్య సమాజం సిగ్గుపడేలా చేసింది. రెండు రోజులుగా జ్వరంతో బాధపడిన వృద్ధుడి (70)కి ఆస్పత్రిలో చేర్పించాడు కొడుకు. అయితే, అతని పరిస్థితి విషమించడంతో ఇంటికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. ఆదివారం ఆ వృద్ధుడు తీవ్ర అస్వస్థతతో కన్నుమూశాడు. ఈ విషయాన్ని తనయుడు రెవెన్యూ అధికారులు, బంధువులకు తెలిపాడు. తండ్రికి అంత్యక్రియలు నిర్వహించేందుకు సహకరించాలని వేడుకున్నాడు. అయినా ఎవరూ ముందుకు రాలేదు. అంబులెన్స్‌ సమకూర్చేందుకు కూడా ముందుకురాలేదు. చివరకు తనయుడే తన తండ్రి శవాన్ని సైకిల్‌పై తోసుకుంటూ శ్మశానానికి వెళ్లాడు. శవాన్ని తీసుకెళ్తున్న సమయంలో ముందు జాగ్రత్తగా పీపీఈ దుస్తులు ధరించినట్లు కొడుకు తెలిపారు. దహనసంస్కారాలకు బంధువులు కూడా ఎవరు ముందుకు రాకపోవడం పట్ల భాధ కలిగించిందని తెలిపాడు.