ఐపీఎల్‌లో ‘ఆ’ సందడి ఉండదు..
కరోనా రక్కసి వ్యాప్తితో పరిస్థితులన్నీ తారుమారయ్యాయి. ఐపీఎల్ సందడి లేకుండానే వేసవి వెళ్లిపోయింది. స్టార్ హీరోల సినిమాల నుంచి ఐపీఎల్ మ్యాచ్‌ల వరకు అన్ని ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయి....
కరోనా రక్కసి వ్యాప్తితో పరిస్థితులన్నీ తారుమారయ్యాయి. ఐపీఎల్ సందడి లేకుండానే వేసవి వెళ్లిపోయింది. స్టార్ హీరోల సినిమాల నుంచి ఐపీఎల్ మ్యాచ్‌ల వరకు అన్ని ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయి. యూఏఈలో ఐపీఎల్ నిర్వహణకు భారత ప్రభుత్వం తాజాగా అనుమతిచ్చిన నేపథ్యంలో క్రికెటర్లు, ప్రాక్టీసుకు రెడీ అవుతున్నారు. దోనీ ఈపాటికే ప్రాక్టీస్ మొదలుపెట్టేశారు. వైరస్ ప్రభావం వల్ల ఈ సీజన్లో చాలా అంశాల్ని మనం మిస్సవబోతున్నాం. ఐపీఎల్ అంటేనే ఫుల్ టు ఫుల్ కలర్.. అందులోనూ బాలీవుడ్ భామల సందడి .. ఒకటేమిటీ అంతా అక్కడే ఉంటారు.
ఇవే మార్పులు…
స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ కరోనా నిబంధనలను జారీ చేసింది. వాటిలో ఇలా ఉన్నాయి. మ్యాచ్ ప్రారంభంలో టాస్ వేసేటప్పుడు టీమ్ జాబితా పేపర్లో కాకుండా డిజిటల్‌గా ఉండనుంది. ఐపీఎల్ మస్కట్ ఈసారి కనిపించదు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలి. గ్రౌండ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒకరితో ఒకరు షేక్ హ్యాండ్స్ ఇవ్వడం పూర్తిగా నిషేధం. ఇలాంటి నిబంధనలు అమల్లో ఉండనున్నాయి. ఆటగాళ్లు తమ కిట్‌లోని వస్తువులను మరొకరితో పంచుకోవడానికి కూడా వీల్లేదని తెలుస్తోంది.
ప్రేక్షకులు లేకుండానే..
ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు, యూఏఈ అథారిటీలు, వైద్య నిపుణులతో పాటు పలు ఏజెన్సీలతో కలిసి బీసీసీఐ ఐపీఎల్‌ను నిర్వహించబోతోంది. ఇందులో భాగంగా ప్రేక్షకులు ఎవరూ లేకుండా ఖాళీ స్టేడియాల్లోనే మ్యాచ్‌లు జరపనుంది. కానీ ఈ మ్యాచ్‌లను డిజిటల్ ఆధారంగా చూసే ఛాన్స్ ఉంది.