స్వామి అగ్నివేశ్‌ కన్నుమూత

ఆర్యసమాజ్‌ నేత, సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్‌ కన్నుమూశారు. కాలేయ సమస్యతో ఢిల్లీలోని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ లివర్‌ బిలియరీ సైన్సెస్‌‌లో గత కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్నారు.  మంగళవారం రోజు ఆయన ఐఎల్‌బీఎస్‌ ఆయన మరోసారి చికిత్స కోసం చేరారు.

స్వామి అగ్నివేశ్‌ కన్నుమూత

Updated on: Sep 11, 2020 | 8:58 PM

Social activist Swami Agnivesh : ఆర్యసమాజ్‌ నేత, సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్‌ కన్నుమూశారు. కాలేయ సమస్యతో ఢిల్లీలోని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ లివర్‌ బిలియరీ సైన్సెస్‌‌లో గత కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్నారు.  మంగళవారం రోజు ఆయన ఐఎల్‌బీఎస్‌ ఆయన మరోసారి చికిత్స కోసం చేరారు. కీలక అవయవాల వైఫల్యంతో వెంటిలేటర్‌పై ఉన్న స్వామి అగ్నివేశ్‌ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు మరణించారని వైద్యులు వెల్లడించారు. అగ్నివేశ్‌ 1939, సెప్టెంబర్‌ 21న ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో జన్మించారు.

స్వామి అగ్నివేశ్‌ గతంలో ఆర్యసభ పేరిట రాజకీయ పార్టీని స్ధాపించి హరియాణా అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆర్యసమాజ్‌ సిద్ధాంతాలకు అనుగుణంగా ఆయన ఆర్యసభ పార్టీని  నడిపించారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టులతో జరిగిన చర్చలకు ఆయన మధ్యవర్తిత్వం వహించారు. భిన్న మతాల మధ్య పలు అంశాలపై ఆయన వారధిగా పనిచేశారు. అగ్నివేశ్‌ మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.