
స్విట్జర్లాండ్‌లో విచిత్రం చోటుచేసుకుంది. కోకోవా (చాక్లెట్ తయారీకి వాడే కోకోబీన్స్) మంచు కురిసింది. దీన్ని చూసి స్విస్ పట్టణవాసులు ఆశ్చర్యపోయారు. అయితే, ఓ చాక్లెట్ ఫ్యాక్టరీలో వెంటిలేషన్ వ్యవస్థ పనిచేయకపోవడంతో కోకోవా మంచు కురవడం మొదలైందట. రిచ్, బాసెల్ మధ్య ఓల్టెన్‌లోని తమ కర్మాగారంలో కాల్చిన ‘కోకో నిబ్స్’ శీతలీకరణ వెంటిలేషన్‌లో స్వల్ప లోపం ఉందని లిండ్ట్ అండ్ స్ప్రూయంగ్లీ సంస్థ ధ్రువీకరించింది.
వెంటిలేషన్ వ్యవస్థలోని లోపల కారణంగా.. కోకో పౌడర్ బలమైన గాలులతో కలిసి సమీప ప్రాంతాల్లో వ్యాపించిందని తెలిపింది. ఒక కారుపై కోకో పౌడర్ పూత ఏర్పడిందని, దాన్ని తామే బాగుచేయిస్తామని సదరు యజమానికి తెలిపామని పేర్కొంది. ఈ కోకో కణాలు ప్రజలు, పర్యావరణానికి పూర్తిగా ప్రమాదకరం కాదని వెల్లడించింది. వెంటిలేషన్ వ్యవస్థకు మరమ్మతులు చేయించినట్లు తెలిపింది.
Read More:
ఏపీలోని ఆ జిల్లాలో.. 50 ఏళ్లు పైబడిన వారికి.. నో హోమ్ ఐసోలేషన్..!