నేషనల్‌ బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌‌లో.. 16 మంది ఆటగాళ్లకు కరోనా..

| Edited By:

Jun 27, 2020 | 1:54 PM

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే మూడు నెలలకు పైగా అన్ని క్రీడా ఈవెంట్లు నిలిచిపోయాయి. ఇప్పుడిప్పుడే పలు క్రీడా సంఘాలు

నేషనల్‌ బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌‌లో.. 16 మంది ఆటగాళ్లకు కరోనా..
Follow us on

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే మూడు నెలలకు పైగా అన్ని క్రీడా ఈవెంట్లు నిలిచిపోయాయి. ఇప్పుడిప్పుడే పలు క్రీడా సంఘాలు, సమాఖ్యలు ఆటలను పునఃప్రారంభించాలని ఆలోచిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయా ఆటగాళ్లకు నిర్వహిస్తున్న కరోనా పరీక్షల్లో పలువురు వైరస్‌ బారిన పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య కొందరు టెన్నిస్‌ ప్రముఖులతో పాటు 10మంది పాకిస్థాన్‌ క్రికెటర్లు సైతం ఈ మహమ్మారి బారినపడిన సంగతి తెలిసిందే.

అమెరికాలో కరోనా వీరవిహారం చేస్తోంది. ఈ క్రమంలో.. తాజాగా నేషనల్‌ బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌(ఎన్‌బీఏ)లోనూ 16 మంది ఆటగాళ్లు వైరస్‌ బారిన పడ్డారు. ఈనెల 23న మొత్తం 302 మంది ఆటగాళ్లకు నిర్వహించిన పరీక్షల్లో ఇంత మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయిందని ఆ సంఘం వెల్లడించింది. అయితే, వారి పేర్లను మాత్రం బయటకు చెప్పలేదు. అలాగే వచ్చేనెల 30 నుంచి ఫ్లోరిడాలోని డిస్నీ వరల్డ్‌లో కొత్త సీజన్‌ను ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పింది. ఎన్‌బీఏలో మొత్తం 30 జట్లు ఉండగా, 22 టీమ్‌లనే ఆడించాలనుకుంటున్నట్లు తెలిపింది.